Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood) ప్రస్తుతం ఒక స్వర్ణయుగాన్ని తలపిస్తోంది. గ్లోబల్ స్థాయిలో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటుతున్నా, లోకల్‌గా ఉండే కొత్త ప్రతిభకు మాత్రం సరైన బ్రేక్ దొరకడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ఇలాంటి తరుణంలో, కేవలం లాభాల కోసం కాకుండా, నిజమైన ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా టాలీవుడ్‌లోకి ఓ కొత్త బ్యానర్ అడుగుపెట్టింది. అదే ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ (Kalyan Art Productions). నిర్మాత కళ్యాణ్ (Producer Kalyan) సారథ్యంలో మొదలైన ఈ నిర్మాణ సంస్థ, పరిశ్రమలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టేందుకే అని ఆయన తెలపడం విశేషం.
ఇకపై మాటల్లో కాదు, చేతల్లో..
ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడే మాట ‘కథే హీరో’. కానీ, ఆచరణలో స్టార్ పవర్ వైపే అందరూ మొగ్గు చూపుతుంటారు. నిర్మాత కళ్యాణ్ మాత్రం ఈ పాత మూసను బ్రేక్ చేయాలనుకుంటున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఆలోచింపజేసే, సమకాలీన అంశాలతో కూడిన కథలకు ఈ బ్యానర్ పెద్దపీట వేయనుంది. ప్రయోగాత్మక సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు వెనకాడుతుంటారు. కానీ, ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’లో క్రియేటివిటీకి, కొత్త ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని నిర్మాత కళ్యాణ్ చెబుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘ప్రతిభ ఉండి, సరైన వేదిక లేని వారందరికీ మా బ్యానర్ ఒక కల్పవృక్షంలా మారుతుంది’ అని నిర్మాత కళ్యాణ్ ప్రకటించారు. కేవలం కంటెంట్‌ను నమ్మి వచ్చే కొత్త దర్శకులకు ఇక్కడ రెడ్ కార్పెట్ స్వాగతం లభించనుందని ఆయన పేర్కొన్నారు.
Also Read- Prabhas vs Vijay: అక్కడ ప్రభాస్ సినిమాకు నో థియేటర్స్.. ఇక్కడ విజయ్ సినిమాకు మాత్రం..?
సంక్రాంతికి అసలైన సందడి
ఇప్పటికే ఈ బ్యానర్‌లో కొన్ని ఆసక్తికరమైన కథలు ఫైనల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి సినిమా వివరాలను రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించి, వీలైనంత త్వరగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను అందించాలనే పట్టుదలతో టీమ్ ఉందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి కొత్త కొత్త బ్యానర్లు రావడం శుభపరిణామమే. ముఖ్యంగా కంటెంట్ మీద నమ్మకంతోనూ, సినిమాపై ప్యాషన్‌తో వచ్చే నిర్మాతలు ఉంటే.. టాలీవుడ్‌లో మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కూడా ఆ దిశగా అడుగులేసి, టాప్ బ్యానర్‌గా మారుతుందేమో చూద్దాం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

