Alcohol to Dog: ఈ భూమ్మీద మనుషులతో పాటు ఎన్నో మూగజీవాలు జీవిస్తున్నాయి. వాటిపట్ల జాలిగా వ్యవహరించకపోయినా ఫర్వాలేదు. కానీ, క్రూరంగా వ్యవహరిస్తే మాత్రం కటకటాల పాలవ్వాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బఘ్‌పట్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక శునకం పట్ల ఓ వ్యక్తి కర్కశంగా వ్యవహరించాడు. బలవంతంగా మద్యం (Alcohol to Dog) పట్టించాడు. లిక్కర్ సీసాలో అప్పటికే మద్యం ఉండగా, మత్తు కలిగించే మరో పదార్థాన్ని కూడా కలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఇది పోలీసుల కంట్లో పడింది. దీంతో, నిందిత వ్యక్తిపై బఘ్‌పట్ జిల్లా సోషల్ మీడియా విభాగం అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడులో జైలులో ఉన్నాడు.
Read Also- Seethakka: సమ్మక్క చిలకలగుట్ట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది : మంత్రి సీతక్క!
జంతువుల పట్ల క్రూరత్వం చట్టాల కింద కేసు పెట్టారు. నిందిత వ్యక్తి పేరు జితేంద్ర అలియాస్ బల్లమ్ అని వెల్లడించారు. నిందిత వ్యక్తి శునకాన్ని టార్చర్ పెడుతున్నట్టుగా వీడియోలో స్పష్టమైందని, బలవంతంగా మద్యం తాగించడం కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు. రామలా పోలీస్ స్టేషన్‌తో కలిసి ప్రాథమిక దర్యాప్తు కూడా చేపట్టామని వివరించారు. నిందిత వ్యక్తి కిర్తల్ గ్రామానికి చెందినవాడని తెలిపారు. జితేంద్రను ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. జంతువులపై క్రూరత్వంపై నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, బఘ్‌పట్ పోలీసులు స్పందించారు.
ఈ చర్యలన్నీ జంతువులపై క్రూరత్వమే
జంతువులు మాట్లాడలేవు కదా, బాధను వ్యక్తపరచలేవని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చట్టాలు చూస్తూ ఊరుకోవు. జంతుహింసకు పాల్పడితే తగిన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జంతువులపై దాడి చేసి కొట్టడం, గాయపరచడం, ఆకలితో అలమటించేలా చేయడం, బలవంతంగా ప్రమాదకరమైన పదార్థాలు తినేలా చేయడం, తమ పనుల కోసం హింసించడం లాంటి చర్యలన్నీ చర్యలు జంతు క్రూరత్వం కిందకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో జంతువులపై హింసను నిషేధిమని, చట్టాల ప్రకారం, శిక్షార్హులు అవుతారని హెచ్చరిస్తున్నారు. నేటికాలంలో సోషల్ మీడియా పవర్‌ఫుల్‌గా ఉండడంతో ఏ చిన్న ఘటనైనా వైరల్ అవుతోంది. తద్వారా పోలీసులు, ప్రభుత్వాలు దృష్టికి వెళుతోంది. నెటిజన్లు కూడా అప్రమత్తమయ్యి పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఇది అందరి బాధ్యత కూడా. కాబట్టి, జంతువులను ప్రేమించకపోయినా ఫర్వాలేదు. కానీ, హింసకు పాల్పడొద్దని ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తాజా ఘటనతో హెచ్చరించినట్టు అయ్యింది. ఇంట్లోని చిన్న పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే జంతువుల పట్ల ప్రేమ, దయార్థ హృదయంతో ఉండేలా నేర్పాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.
#baghpatpolice
थाना रमाला पुलिस ने सोशल मीडिया ट्विटर (X) पर वायरल वीडियो में कुत्ते को क्रूरता के साथ बलपूर्वक शराब की बोतल से मादक द्रव्य पिलाने वाले अभियुक्त को किया गिरफ्तार ।@Uppolice pic.twitter.com/0LdjNTolb3— Baghpat Police (@baghpatpolice) January 5, 2026

