Medak District (imagecredit:swetcha)
మెదక్

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సోమవారం రిలీజ్ కావడంతో మెదక్ ఉమ్మడి జిల్లా లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. వెనువెంటనే ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జిల్లాల్లో 2 దశల్లో ఎంపీపీ(MPP),జడ్పిటిసి(ZPTC) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 11 వరకు 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. అక్టోబర్ 23, 27, తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.అక్టోబర్,31,నవంబర్,4,8,తేదీల్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించ నున్నారు.అదేరోజు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి పలితాలు ప్రకటించనున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా లో.. 72మండలాలు..

1613 పంచాయతీలు!

3 జిల్లా పరిషత్ లు..

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 3 జిల్లా పరిషత్ లు ఉన్నాయి. మెదక్(Medak), సంగారెడి(Sangareddy),సిద్దిపేట(Sidhipeta),జిల్లాలో మొత్తం 72 మండలాలు ఉన్నాయి. 72 జడ్పీటీసీలు ఎంపీపీలు, 691 ఎంపీటీసీల స్థానాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా లో 26 మండలాలు ఉండగా 26 జడ్పీటీసీ లు,230 ఎంపీటీసీలు, ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలు ఉండగా 25 జడ్పీటీసీ లు,261 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మెదక్ జిల్లా లో 21 మండలాలు ఉండగా 21 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. 190 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో 1613 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత 2 రోజుల క్రితం ఎంపీపీ, జడ్పిటిసి, పంచాయతీ, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఆయా జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, ప్రావీణ్య, హైమావతి ల ఆధ్వర్యంలో అధికారులు 42 శాతం బీ సి లకు, ఎస్సీ ఎస్టీలకు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. నేడు సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల కు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి ప్రారంభమైంది.

Also Read: Telangana Govt: హైదరాబాద్‌లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం

జిల్లాల నుంచి.. గ్రామాల వరకు.. రిజర్వేషన్ ల పై రాజకీయ పార్టీల ఆరా..

తగిన అభ్యర్థుల కోసం వేట!

ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి

మాజీ సీఎం కేసీఆర్ స్వంత జిల్లాపై పట్టు సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుతో ముందుకెళుతుంది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ(Damodara raja narasimha), పొన్నం ప్రభాకర్(Ponnam Prbhakar), వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy) లు త్వరలో ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్(BRS) పార్టీ బలంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుతో ఉమ్మడి జిల్లా లో 11 అసెంబ్లీ నియోజక వర్గాల ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

గతంలో 3 జిల్లా పరిషత్‌లు సహితం మెదక్(ఛాదలర), సిద్దిపేట(Sidhipeta),సంగారెడ్డి(Sangareddy) లను అప్పటి అధికార బీ ఆర్ ఎస్ పార్టీ గెలుచుకుంది. మెదక్ జిల్లా పరిషత్( అన్ రిజర్వుడు) జనరల్ కు రిజర్వేషన్ ఖరారు చేశారు.సంగారెడ్డి జిల్లా పరిషత్ ఎస్సీ( జనరల), సిద్దిపేట జిల్లా పరిషత్ (బీ సి జనరల్) కు రిజర్వేషన్ ఖరారు చేశారు. ఆయా జిల్లాల్లో రిజర్వేషన్ లకు అనుగుణంగా అభ్యర్థుల వేట అన్ని రాజకీయ పార్టీల లో కొనసాగుతుంది. బిజెపి పార్టీ సహితం వార్డు సభ్యుని నుంచి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లకు అభ్యర్థులను పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మెదక్ ఉమ్మడి జిల్లా బాధ్యతలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కు అప్పగించినట్లు సమాచారం.

Also Read: Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్

ఉమ్మడిజిల్లలో..ఓటర్లు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం ఓటర్లు 19 లక్షల 23 వేల 442 మంది ఉన్నారు.ఇందులో పురుషులు 9 లక్షల,41 వేల,556 మంది ఓటర్లు ఉన్నారు.మహిళలు,9 లక్షల,81వేల 828 మంది ఉన్నారు,ఇతరులు 58 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలు ఉండగా 613 గ్రామపంచాయతీ లు ఉన్నాయి.అదేవిధంగా 5,370 వార్డులను విభజించారు.అందులో మొత్తం 7 లక్షల 44,157 మంది ఓటర్లు ఉండగా పురుషులు,3 లక్షల,68 వేల,258 మంది,కాగా మహిళలు 3 లక్షల 75 వేల 855 మంది ఉన్నారు.ఇతరులు 44 మంది ఉన్నారు.సిద్దిపేట జిల్లాలో 26 మండలాల్లో 508 గ్రామ పంచాయతీలు ఉండగా 4,508 వార్డు ఉన్నాయి.మొత్తం ఓటర్లు 6 లక్షల 55 వేల 958 మంది ఓటర్లు ఉండగా పురుషులు, 3 లక్షల 21 వేల 766 మంది ఓటర్లు ఉన్నారు.

మహిళలు, 3 లక్షల 34 వేల,186 మంది ఉన్నారు.ఇతరులు 6 మంది ఉన్నారు.మెదక్ జిల్లా పరిధిలో 21 మండలాలు ఉండగా 492 గ్రామ పంచాయతీలలో 4,220 వార్డు లు ఉండగా మొత్తం,5 లక్షల,23 వేల,327 మంది ఓటర్లు ఉన్నారు.అందులో పురుషులు,2 లక్షల,51 వేల 532 మంది ఉన్నారు.మహిళలు 2లక్షల 71 వేల 787 మంది ఓటర్లు ఉన్నారు.ఇతరులు 8 మంది ఉన్నారు. జెడ్పిటిసి నుండి మొదలుకుంటే ఎంపీటీసీ సర్పంచ్ ,వార్డు, స్థానాలకు 42 శాతం బీ సి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు, రిజర్వేషన్లు హాయ్ జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఖరారు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఆనందచాలతో ఎన్నికల్లో పాల్గొనేందుకు యువకులు మహిళలు ముందుకు వస్తున్నారు. బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Movie Piracy Racket: దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. వెలుగులోకి సంచలన నిజాలు

Just In

01

Old Age Couple: 80 ఏళ్ల వయసులో వృద్ధ జంట ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన

Warangal District: స్థానిక సమరంపై సందిగ్ధంలో ఆశావహులు.. ఇంకేమైనా మార్పులు వచ్చేనా!

Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!