Movie Piracy Racket (Image Source: Twitter)
తెలంగాణ

Movie Piracy Racket: దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. వెలుగులోకి సంచలన నిజాలు

Movie Piracy Racket: దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దీనిపై హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి.. దర్యాప్తులో బయటపడ్డ సంచలన విషయాలను వెల్లడించారు. 4 నెలల పాటు కష్టపడి దర్యాప్తు చేశామన్న సీపీ.. దేశంలోనే తొలిసారి ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ పైరసీ కారణంగా 2023లో దేశంలోని సినీ ఇండస్ట్రీ రూ.22,400 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. 2024లో తెలుగు చిత్ర పరిశ్రమ రూ.3,700 కోట్లు కోల్పోయినట్లు సీపీ తెలియజేశారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేపట్టగా.. పైరసీ ముఠాకు ఐదుగుర్ని అరెస్ట్ చేయగలిగినట్లు వెల్లడించారు.

పైరసీ వెనక బెట్టింగ్ యాప్ నిర్వాహకులు

పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. వెంటనే దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పైరసీ సినిమాల వల్ల ఆన్లైన్ బెట్టింగ్ కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. ‘టొరెంట్ వెబ్ సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారు. సర్వర్స్ హ్యాకింగ్ తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. తద్వారా పైరసీ మూవీల ద్వారా తమ యాప్ లను ప్రచారం చేసుకుంటున్నారు’ అని సీపీ తెలియజేశారు.

హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

తమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్ సైట్స్ లో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన జానా కిరణ్ ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు అత్తాపూర్ లోని మంత్ర మాల్ థియేటర్ లో సినిమా కాపీ చేశాడని తెలియజేశారు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించామని.. ఫైనల్ గా జాన కిరణ్ కుమార్ నిందితుడని తేలిందని సీపీ తెలియజేశారు. అతడు ఏకంగా నలభై మూవీలను థియేటర్ లో కాపీ చేశాడని సీపీ స్పష్టం చేశారు. ఒక్కో సినిమాకు 150-500 డాలర్ల వరకూ పొందుతున్నట్లు చెప్పారు.

పైరసీ ఎలా చేస్తున్నారంటే?

థియేటర్ లో సినిమాను పైరసీ చేసేముందు.. నిందితులు సూటబుల్ సీటు చూసుకుని టికెట్ బుక్ చేసుకుంటున్నారని సీపీ తెలిపారు. హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్ తో రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. మెుబైల్ స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా పైరసీకి పాల్పడుతున్న బిహార్ కు చెందిన అర్సలన్, సత్యమంగళంకు చెందిన సుధాకరన్ ను సైతం గుర్తించామని చెప్పారు. వారు సినిమాను పైరసీ చేసి కరూర్ కు చెందిన సిరిల్ అనే వ్యక్తికి పంపుతున్నారని చెప్పారు. అతడు 4 వెబ్ సైట్స్ లో ఈ పైరసీ కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నాడని వివరించారు. కాబట్టి ఈ మెుత్తం కేసులో సిరిల్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు నగర సీపీ వివరించారు. నిందితులు కంప్యూటర్ సైన్స్ చేసినప్పటికీ ఈజీ మనీ కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారని సీపీ స్పష్టం చేశారు.

నెలకు రూ.9 లక్షలు.. 

సిరిల్ అనే వ్యక్తి నెలకు సుమారు 15 సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. వాటిలో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు గాను 1xbet , 4ra bet, rajbet, Parimatchల నుంచి నెలకు రూ. 9 లక్షలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. తమిళ్ బ్లాస్టర్స్ అనే ఒక్క వెబ్ సైట్ లోనే ఇప్పటివరకూ 500 మూవీలను సిరిల్ అప్లోడ్ చేసినట్లు గుర్తించామని సీపీ అన్నారు. ‘రీసెంట్ గా విడుదలైన కుబేర మూవీ కూడా సిరిల్ వద్ద గుర్తించాం. 10 క్రిప్టో కరెన్సీ వాలెట్, మూడు బ్యాంకు ఖాతాలు సిరిల్ వినియోగిస్తున్నారు. క్రిప్టో కరెన్సీనీ యూఎస్ డాలర్లోకి ట్రేడింగ్ చేసే అశ్విని కుమార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నాం’ అని హైదరాబాద్ సిటీ కమిషనర్ చెప్పుకొచ్చారు.

Also Read: Kayadu Lohar: నా ఫ్రెండ్ చనిపోలేదు.. విజయ్‌ను తిట్టింది ఇంకెవరో.. తమిళ నటి క్లారిటీ

థ్యాంక్స్ చెప్పిన దిల్ రాజు

దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఫైరసి రోజురోజుకి పెరిగి పోతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది నేరాలు పెరుగుతున్నాయి. GST రూపంలో 18 శాతం రెవిన్యూ వస్తుంది. ఫైరసి వలన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా దెబ్బతింటోంది. హైదరాబాద్ సినిమా హబ్ గా చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ఇకపై ఎవ్వరూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చెయ్యరు’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Also Read: Indiramma Canteens: హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేవలం రూ.5కే వెరైటీ టిఫిన్స్, భోజనం

Just In

01

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ భారీ బడ్జెట్ సినిమా స్టార్ట్.. విలన్ ఎవరంటే?

Karur stampede FIR: విజయ్‌కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటన ఎఫ్ఐఆర్ లీక్.. వెలుగులోకి షాకింగ్ అంశాలు

Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్

Sasivadane trailer: ప్రేమిస్తే యుద్ధం తప్పదా!.. అది తెలియాలంటే ఈ ట్రైలర్ చూసేయండి..

World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!