Indiramma Canteens (Image Source: Twitter)
తెలంగాణ, హైదరాబాద్

Indiramma Canteens: హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేవలం రూ.5కే వెరైటీ టిఫిన్స్, భోజనం

Indiramma Canteens: అతి తక్కువ ఖర్చుతో పేదల ఆకలి తీర్చే ఇందిరమ్మ క్యాంటీన్లు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ లోని మింట్ క్యాంపస్ లో ఇందిరమ్మ క్యాంటీన్ ను జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం లబ్దిదారులకు మంత్రి, మేయర్, ప్రజాప్రతినిధులు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు.

హరే కృష్ణ హరే రామ సహకారంతో

ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘గరీబీ హటావో అనే నినాదంతో ఇందిరమ్మ పేదల అభివృద్ధికి కృషి చేసింది. ఇందిరమ్మ స్పూర్తితో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గృహ విద్యుత్ , వడ్డీలేని రుణాలు అందజేస్తున్నాం. హరే కృష్ణ హరే రామ సహకారంతో ప్రభుత్వ ఆర్థిక సబ్సిడీతో ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా పేదలకు అల్పాహారం, భోజనం అందించబోతున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి మహిళ.. పట్టణ స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం పొందాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. మీ అందరి సహకారంతో హైదరాబాద్ కు మంచి పేరు రానుంది’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

నగరంలో 150 క్యాంటీన్లు

ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సైతం మాట్లాడారు. పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఎంతగానో ప్రయోజనకరమని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు తెరవబోతున్నట్లు ఆమె తెలిపారు. వీటి ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేయనున్నట్లు ఆమె చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (SHG) మహిళలు దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ క్యాంటీన్లను కేటాయిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

రోజుకో వెరైటీ టిఫిన్స్

మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్ లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు బల్దియా సిద్దమైంది. రోజుకో వెరైటీ టిఫిన్స్ అందించాలని భావిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూను కూడా ఖరారు చేసింది. తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 స్టాళ్లను ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 60 స్టాళ్లను ప్రారంభానికి సిద్దం చేసింది. ప్రతి టిఫిన్ స్టాల్ లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రూ.19 టిఫిన్.. రూ.5లకే

ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ 19 ఖర్చవుతుండగా.. లబ్దిదారుల నుంచి రూ.5లు మాత్రమే వసూలు చేయనున్నారు. మిగిలిన రూ.14ను జీహెచ్ఎంసీ భరించనుంది.

Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి

వీక్లీ టిఫిన్ మెనూ..

సోమవారం: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
మంగళవారం: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
బుధవారం: పొంగల్, సాంబార్, చట్నీ
గురువారం: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
శుక్రవారం: పొంగల్, సాంబార్, చట్నీ
శనివారం: పూరీ (3), ఆలూ కూర్మా

Also Read: Asia Cup 2025: పాక్‌పై సూపర్ విక్టరీ.. ట్రోఫీ తీసుకునే వేళ హైడ్రామా.. ఇది కదా టీమిండియా అంటే!

Just In

01

Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్

Sasivadane trailer: ప్రేమిస్తే యుద్ధం తప్పదా!.. అది తెలియాలంటే ఈ ట్రైలర్ చూసేయండి..

World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!

OG collections: ‘ఓజీ’ నాలుగో రోజు గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆ రికార్డులు బ్రేక్..

Aadhaar Card : ఇక పై ఆధార్ కార్డ్ కావాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే.. అక్టోబర్ 1 నుంచే అమలు.. ఎంతంటే?