Asia Cup 2025: ఆసియా కప్ – 2025 ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్స్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో పాక్ ను ఫైనల్స్ లో ఓడించి.. దేశానికి అద్భుత విజయాన్ని అంకితం చేశారు. అయితే మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు భారత ప్లేయర్లు నిరాకరించారు. చేతుల్లో ట్రోఫీ లేకపోయినా ఉన్నట్లు భావించి.. మన కుర్రాళ్లు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అలా ఎందుకు చేశారంటే?
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అయిన మోసిన్ నక్వీ.. ప్రస్తుతం పాక్ మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ గానూ పదవిలో కొనసాగుతున్నారు. ఆసియా కప్ – 2025 ట్రోఫీని ఆయన చేతుల మీదుగా టీమిండియాకు అందించాలని చివర్లో ప్లాన్ చేశారు. నక్వీ చేతుల మీదగా తాము ట్రోఫీ తీసుకోబోమని భారత జట్టు తేల్చి చెప్పింది. దీంతో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ కు నక్వీ.. సెకండ్ ప్రైజ్ మనీ అందించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పాక్ ను మట్టికరిపించిన ఆనందంలో ఉన్న భారత ఆటగాళ్లు.. ట్రోఫీ లేకుండానే సంబురాలు చేసుకోవడం విశేషం.
రోహిత్ శర్మ స్టైల్లో సెలబ్రేషన్స్
గతేడాది జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ట్రోఫీ అందుకునే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక డిఫరెంట్ స్టైల్లో స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చి ట్రోఫీని అందుకుంటాడు. విన్నింగ్ ట్రోఫీని పైకెత్తి కుర్రాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాడు. సరిగ్గా ఇదే సక్సెస్ ఫార్మూలాను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఫాలో అయ్యింది. కెప్టెన్ సూర్య సైతం చేతిలో ట్రోఫీ లేనప్పటికీ రోహిత్ తరహాలోనే స్టైల్ గా నడుచుకుంటూ వచ్చాడు. అటు భారత ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, గిల్, అభిషేక్ శర్మ, తిలక్ సైతం సూర్య చేతిలో ట్రోఫీ ఉన్నట్లే భావించి విజయ గర్వంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Asia Cup 2025 Final Trophy Controversy: Mohsin Naqvi on Stage, But India Refuses the Handover pic.twitter.com/fEVrpeuTy8
— NextMinute News (@nextminutenews7) September 29, 2025
Also Read: Kunamneni Sambasiva Rao: ప్రజాస్వామ్యానికి పునాదులు అవే.. సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు
డ్రెసింగ్ రూమ్‌కు ట్రోఫీ
అంతకుముందు ఆసియా ట్రోఫీని ఎవరూ అందజేస్తారని టీమిండియా మేనేజ్ మెంట్.. ఏసీసీ (ACC) నిర్వాహకులను అడిగింది. దీంతో ఏసీసీ గందరగోళంలో పడింది. పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని భారత ఆటగాళ్లు.. ట్రోఫీని పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నుంచి ఎలా తీసుకుంటారని తమలో తాము తర్జనభర్జన అయ్యారు. ఈ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలోనే ట్రోఫీ ఇచ్చే వేదికపైకి మోసిన్ నక్వీ ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో స్టేడియమంతా ఒక్కసారిగా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో మార్మోగింది. నక్వీ నుంచి ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు ససేమీర అనడంతో ట్రోఫీని డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. మరోవైపు ఓటమి అనంతరం గంటన్నరసేపు వరకూ పాక్ ఆటగాళ్లు డ్రెసింగ్ రూమ్ నుంచి బయటకు రాకపోవడం గమనార్హం.
🚨🚨Breaking 🚨🚨
India said “No thanks” to Mohsin Naqvi’s Trophy 🤷♂️
Pakistan Immediately declared themselves ASIA CUP 2025 Champions! 🏆
Shahid Afridi leading the Victory march in Karachi like it’s a Netflix Series. 🇵🇰😂😅😆 pic.twitter.com/cOqjQerquy— SusreeSangita_❤️🔥 (@Susree_Official) September 29, 2025