Bathukamma 2025 (IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Bathukamma 2025: నేడు గిన్నిస్ బుక్ ఆఫ్ లక్ష్యంగా.. బతుకమ్మ ప్రపంచ రికార్డుకు సిద్ధం!

Batukamma 2025: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను (Bathukamma 2025) ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు పది వేల మందితో సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకను నిర్వహిస్తున్నారు.

అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బల్దియా నుంచి, సెర్ప్ నుంచి మహిళలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి జీహెఛ్ఎంసీ నుంచి 4500 మంది, రంగారెడ్డి 2 వేలు, యాదాద్రి నుంచి 2 వేలు, మేడ్చల్ నుంచి 2వేల మందిని తరలించే బాధ్యతలను అధికారులకు అప్పగించారు. 63 పీట్ల ఎత్తులో బతుకమ్మను ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం 1500 మంది మహిళలతో బతుకమ్మ సాంగ్ పై రీహర్సల్స్ నిర్వహించారు. అందరూ బతుకమ్మ పాటకు ఒకే స్టేప్ వేసేలా పక్డ్బందీ చర్యలు చేపట్టారు.

 Also Read:R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

ఏర్పాట్లను పరిశీలించి టూరిజం అధికారులు

సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రాష్ట్ర పర్యాటక అభివృధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లూరు క్రాంతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, ఇతర పర్యాటక అధికారులు స్టేడియం మొత్తం కలియతిరిగారు. 63 పీట్ల బతుకమ్మ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎండీ క్రాంతి మాట్లాడుతూ ప్లాన్ ప్రకారం చేయాలని, విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సంస్కృతిని చాటేలా ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందని వెల్లడించారు. విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదేశించారు. ఉత్సవాలకు మంత్రులు జూపల్లికృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క పాల్గొంటున్నారని వెల్లడించారు.

 Also Read: BSNL New Plan: గుడ్ న్యూస్.. BSNL ధమాకా ప్లాన్.. ఇంత తక్కువా?

Just In

01

Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!

Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!

The Raja Saab Trailer: ప్రభాస్ భయపెట్టడానికి వచ్చేశాడు రోయ్.. చూసేద్ధాం రండీ..

Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి