Kunamneni Sambasiva Rao ( IMAGE CRDUT: SWETCAH REPORTER)
Politics, తెలంగాణ

Kunamneni Sambasiva Rao: ప్రజాస్వామ్యానికి పునాదులు అవే.. సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు

Kunamneni Sambasiva Rao: ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు స్తంభాలైతే నాలుగో స్తంభం మీడియా అని ఈ నాలుగు వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన మాదిరిగా కునారిల్లిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలను తిరిగి నిలబెట్టడంతో పాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి అనే అంశంపై హైదరాబాద్ బాగ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు.

 Also Read: OTT Movie: మంచు ఎడారిలో చిక్కుకున్న మహిళ సహాయం కోసం వస్తే.. థ్రిల్లింగ్ అదిరిపోద్ది

 న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలి 

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పేదల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులు అక్రమంగా జైళ్లలో బంధించబడుతుంటే దేశాన్ని దోచుకుంటున్న కొంతమంది దొంగలు మాత్రం గద్దేనెక్కుతుండడం దేశానికి పట్టిన గ్రహాణంయ అన్నారు. దేశంలో కొద్దో గొప్పో న్యాయవ్యవస్థ పనిచేస్తున్నందునే సమాజం మనుగడ సాగిస్తోందని, న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే ప్రతి ఉద్యమంలో సీపీఐ ప్రత్యక్షంగా పూర్తిగా భాగస్వామ్యం అవుతుందన్నారు.

ఈవీఎంలతో ఓట్ల చోరీకి పాల్పడుతూ గద్దేనెక్కిన బీజేపీ

తెలంగాణ సాయుధ పోరాట యోదులు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలతో ఓట్ల చోరీకి పాల్పడుతూ గద్దేనెక్కిన బీజేపీ దేశంలోని అన్ని ప్రధాన సంస్థలను చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందన్నారు. బీజేపీ అధికారానికి చరమగీతం పాడేందుకు ఈవీఎం విముక్తి భారత్ పేరుతో ప్రజాఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఇందుకు ప్రశాంత్ భూషణ్ దేశ వ్యాప్తంగా న్యాయకత్వం వహించాలని కోరారు. సదస్సుకు టీఎస్ చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, వామపక్ష, ప్రజా, పౌర హక్కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 Also Read: DGP Shivadher Reddy: మహిళల భద్రతకు పటిష్ట చర్యలు.. నూతన డీజీపీ కీలక వాఖ్యలు

Just In

01

Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్

Sasivadane trailer: ప్రేమిస్తే యుద్ధం తప్పదా!.. అది తెలియాలంటే ఈ ట్రైలర్ చూసేయండి..

World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!

OG collections: ‘ఓజీ’ నాలుగో రోజు గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆ రికార్డులు బ్రేక్..

Aadhaar Card : ఇక పై ఆధార్ కార్డ్ కావాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే.. అక్టోబర్ 1 నుంచే అమలు.. ఎంతంటే?