Medak District: 2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద మరణాలు సుమారు 29 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు(Srnicasa Rao) వెల్లడించారు. అలాగే ఆర్థిక లాభం కోసం జరిగిన దోపిడీలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యలు, రాత్రి సమయాల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మోసాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు 2024 సంవత్సరంతో పోల్చితే 2025లో గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. ఈ విజయాలు సమర్థవంతమైన ముందస్తు పోలీసింగ్, పటిష్టమైన నిఘా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అలాగే వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్ల సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసం పెరిగిది
నిరంతర పర్యవేక్షణ, పోలీసుల దృశ్యమానత పెంపు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాల ద్వారా నేరాల గుర్తింపు, విచారణ, స్పందన మరింత బలపడిందని తెలిపారు. ఫలితంగా ప్రజా భద్రత మెరుగుపడి, పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. 2024తో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 29 శాతం తగ్గుదల నమోదు కావడం సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 2 గంటల పాటు వాహన తనిఖీలు చేయడం వలనే రోడ్డు ప్రమాద మరణాలు ఘననీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. అలాగే 2024తో 6500 కేసులు నమోదు చేయగా 2025 సంవత్సరంలో మొత్తం 11,800 డీడీ (DD) కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
Also Read: Medak Tragedy: మూడు కార్లలో గోవా టూర్.. తిరిగొస్తుండగా బిగ్ షాక్.. ముగ్గురు స్పాట్ డెడ్
గేమింగ్ యాక్ట్ కేసుల వివరాలు:
2024 సంవత్సరంలో గేమింగ్ యాక్ట్ కింద 38 కేసులు నమోదు కాగా, 265 మంది అరెస్టు చేయడం జరిగిదని, రూ.9 లక్షల 70 వేల నగదు సీజ్ చేయడం జరిగింది.
2025 సంవత్సరంలో గేమింగ్ యాక్ట్ కింద 73 కేసులు నమోదు కాగా, 472 మంది అరెస్టు చేయడం జరిగి, రూ.18 లక్షల 18 వేల నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
డయల్–100 కాల్స్ వివరాలు:
2024 సంవత్సరంలో డయల్–100కు సుమారు 38,000 కాల్స్ రాగా, సగటు స్పందన సమయం 8 నిమిషాలుగా ఉండేదని తెలిపారు. 2025 సంవత్సరంలో 37,872 కాల్స్ అందగా, సగటు స్పందన సమయం 4.33 నిమిషాలకు తగ్గిందని వెల్లడించారు. అలాగే గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో కీలక పాత్ర పోషించామని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వెల్లడించారు. ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుందని పేర్కొంటూ, ఏ చిన్న సమాచారం అయినా పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్(SP Mahender), డీఎస్పీ ప్రసన్నకుమార్(DSP Prasanna Kumar) తదితరులు పాల్గొన్నారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఉత్తర్వులు జారీ..!

