Municipal Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు , 6 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రా(Rani)ణి కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు. 1అక్టోబర్ 2025 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఈ మున్సిపల్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ డిసెంబర్ 30 నుండి ప్రారంభమై జనవరి 10 వరకు కొనసాగుతుంది. ఇక మున్సిపల్ కమీషనర్లు తమ పరిధిలోని వార్డుల వారీగా ఫోటో గుర్తింపు కలిగిన ఓటర్ల జాబితా తయారీకి బాధ్యత వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఫార్మాట్‌లోనే మున్సిపల్ జాబితా కూడా ఉంటుంది. జనవరి 1న ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత, పేర్లు లేదా చిరునామాల్లోమార్పులు-చేర్పులకు సంబంధించి అభ్యంతరాలు తెలపవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమీషనర్లకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Illegal Sand Mining: మసక మసక చీకట్లో అక్రమ ఇసుక రవాణా.. రాత్రి అయిందంటే రయ్ రయ్!
షెడ్యూల్, ముఖ్యమైన తేదీలు
ఈసీఐ డేటాను మున్సిపాలిటీల వారీగా విభజించడం
తేదీ 30.12.2025
వార్డుల వారీగా ఓటర్ల డేటా పునర్వ్యవస్థీకరణ
తేదీ.31.12.2025
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ (అభ్యంతరాల స్వీకరణ)
తేదీ. 01.01.2026
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ స్థాయిలో సమావేశం
తేదీ. 05.01.2026
జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం
తేదీ. 06.01.2026
ఓటర్ల తుది జాబితా ప్రచురణ తేదీ.10.01.2026

