Medak District: మారనున్న మెదక్ జిల్లా రూపురేఖలు
Medak District (imagecredit:swetcha)
మెదక్

Medak District: మారనున్న మెదక్ జిల్లా రూపురేఖలు.. రెండు మూడు రోజుల్లో జీవో రిలీజ్..?

Medak District: మెదక్ నియోజకవర్గ అభివృద్ధియే ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు(MLA Mynam Pally Rohith Rao) విజన్ అని, ఎమ్మెల్యే కృషితో మెదక్ పట్టణాన్ని సుందరనందన వనంగా తీర్చిదిద్దుతామని మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్ తెలిపారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లతో వారు మాట్లాడారు. యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)ని కలిసి మెదక్ అభివృద్ధి కి నిధులు కోరరాని, సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రూ 84.24కోట్లు రిలీజ్ చేశారని, రెండు మూడు రోజుల్లో జీవో వస్తుందని త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు గత సర్కార్ అప్పులు చేసినప్పటికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలిపారు.

గత పాలకులునిర్లక్ష్యం

మెదక్‌ను సుందర నందన వనంగా తీర్చిడిద్దడమే ఎమ్మెల్యే సంకల్పమన్నారు. మెదక్ అభివృద్ధి విషయంలో ఏలాంటి రాజీలేదన్నారు. గత పాలకులు పిట్లం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి ఎక్కడిపనులు అక్కడే ఆపేసి వెళ్లిపోయారని విమర్శించారు. పట్టణంలో కల్వర్టులు నిర్మించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమాయ్యారన్నారు. అభివృద్ధి పేరిట గత సర్కార్ కాగితాలు మాత్రమే రిలీజ్ చేసిందని, తాము మాటల్లో కాదు చేతల్లో పనులు చేసి చూపిస్తున్నామన్నారు. సీఎం మంజూరు చేసిన రూ 84.24 కోట్లు తోప్రతి వార్డులో రూ 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి లకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బిఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా అప్పగించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మొక్కవోని దైర్యంతో ముందుకు సాగుతూ తెలంగాణ ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. గత పదేండ్ల లో పాలించిన పాలకులు మెదక్ అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

Also Read: Son after 10 Daughters: బాబోయ్.. వరుసగా 10 మంది కూతుళ్లు.. 11వ సంతానంలో నెరవేరిన ‘కొడుకు కల’

మెదక్‌లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌

యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు మెదక్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. మెదక్ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధి కి పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సఫలికృతులయ్యారని కొనియాడారు. కొత్తగా మెదక్‌లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. మెదక్ పట్టణానికి ఎన్ని నిదులైన ఇవ్వడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని,ఎమ్మెల్యే నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మెదక్‌లో రెండు కేబుల్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాపార రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నామని, తద్వారా మెదక్(Medak)లో షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయన్నారు. మెదక్ ను ఏడ్యూకేషన్ హాబ్‌గా తీర్చిదిద్దెందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయాంటే ఎమ్మెల్యే కృషి ఉందన్నారు. ఇంకా ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చేందుకు రెడీగా ఉన్నాయన్నారు.

నిధులు మంజూరు చేసిన సీఎం

రూ 33కోట్లతో చర్చిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ 50 కోట్లతో పట్టణంలోని ఆయా వార్డుల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ఏడుపాయాల్లోను అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారుమున్సిపల్ ఏర్పాటు నుంచి ఇంత పెద్ద నిధులు రావడం మొదటి సారి అని తెలిపారు. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతా రావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు,మందుగుల గంగాధర్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడూరి ఆంజనేయులు, ముత్యం గౌడ్, బొజ్జ పవన్ తాహేర్ ఆలీ, గాడి రమేష్, దయా సాగర్, నితీష్, ఉమర్,దేవులా, ప్రవీణ్, నాగరాజు, అమిర్, బాలరాజ్ యాదవ్, స్వరూప, చింతల శ్రీను, ముజాంబిల్, మైసన్ తదితరులు ఉన్నారు.

Also Read: Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

Just In

01

Khammam News: నా భర్తకు అక్రమ సంబంధం ఉంది.. ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించిన ఖమ్మం మహిళ

Vishnu Vinyasam: ‘దేఖో విష్ణు విన్యాసం’.. సాంగ్ ఇలా ఉందేంటి?

Mahabubabad News: రసవత్తరంగా మానుకోట మునిసిపాలిటీ చైర్మన్ రేస్.. సమీకరణాలు ఇవే

Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?

Stock Markets Fall: బాబోయ్.. ఇన్వెస్టర్లకు ఒకే రోజు రూ.8.1 లక్షల కోట్లు నష్టం.. అంతా ట్రంప్ వల్లే!