Medak News: మెదక్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా చిన్న శంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి(Gopal Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మెదక్ వెంకటేశ్వర గార్డెన్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(MLA Mynam Pally Rohith Rao), మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Hanumantha Rao), జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చిలుముల సుహాసిని రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. ప్రజలు అవకాశం ఇచ్చి సర్పంచులుగా ఎందుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Tollywood: టాలీవుడ్‌లో మరో న్యూ బ్యానర్.. పేరు ఏంటంటే?
మైనంపల్లి హనుమంతరావు
రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి చేసిందని తెలిపారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశగా గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి(Prabhakr Reddy), యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరశురామ్ గౌడ్, నాయకులు చిట్కూల్ మహిపాల్ రెడ్డి, సుప్రభాత రావ్, రమేష్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి శంకర్, తదితరులు పాల్గొన్నారు. నూతన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎంపికైన ఆవుల గోపాల్ రెడ్డితో పాటు కార్యవర్గానికి శాలువులు. పూలబోకే అందించి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభినందనలు తెలిపారు. పదవికి న్యాయం చేయాలని సూచించారు.
Also Read: Trump on India: మోదీ నన్ను సంతోషపెట్టాలి.. లేదంటే ట్యాక్స్ పెంచుతా.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

