Collector Hymavathi: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా బుదవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే. హైమావతి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసిసి బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 29 నుండి ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిసిందనే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అన్నారు.
పోటీ చేసే అభ్యర్థులందరికీ..
షెడ్యూల్ ప్రకారం రెండు దశలలో జడ్పిటిసి(ZPTC), మరియు ఎంపిటిసి(MPTC) ఎన్నికల పోలింగ్, మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏమి చేయాలో ఏమి చేయరాదో అన్ని నిఘా బృందాలు క్లుప్తంగా తెలుసుకోవాలని సూచించారు. ఓటర్లు ప్రశాంత వారంలో తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఎన్నికలలో వినియోగించుకునేందుకు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకుండా పర్యవేక్షించేందుకు ఎంసిసి బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని మీకు నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిబంధన మేరకు అవకాశాలు కల్పించాలని అదే సమయంలో ఎవరు నిబంధనలను అతిక్రమించి ఓటర్లను మభ్యపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి చేయకుండా నిఘా ఉంచాలని అన్నారు.
Also Read: Sangareddy District: ఫార్మా కంపెనీ వద్దంటూ.. కర్మాగారం ముందు గ్రామస్తులు ఆందోళన
హ్యాండ్ కెమెరాలను ఏర్పాటు..
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని నిగా బృందాలు పగడ్బందీగా తమ విధులను నిర్వహించాలని అన్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీం ల వద్ద సిసి కెమెరా, వీడియో మరియు హ్యాండ్ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. నిఘా బృందాల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలని అన్నారు. ప్రజలు అత్యవసరానికి తీసుకువెళ్లే నగదును స్వాధీనం చేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని ఎన్నికల నిబంధనల మేరకు 50వేల రూపాయల కంటే ఎక్కువ తమ వెంట తీసుకు వెళ్తే వాటికి సరైన పత్రాలు చూపించకపోతే సీజ్ చేయాలని అన్నారు. బ్యాంకులకు సరఫరా అయ్యే నిధుల పై కూడా ప్రత్యేక నిఘాబెట్టి అనుమతికి మించిన నగదు సరఫరా కాకుండా చూడాలని అన్నారు. అనుమతులకు మించి లిక్కర్ సరఫరా కాకుండా ఎక్సైజ్ శాఖ తోపాటు నిఘబృందాలు ఫోకస్ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గరీమా అగ్రవాల్, అడిషనల్ డీసిపీ అడ్మిన్ కుశాల్కర్, జెడ్పి సీఈవో రమేష్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ దేవకీదేవి, ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాస మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Telugu Thalli Flyover: తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్.. స్వాగత తోరణం ఏర్పాటు