Telugu Thalli Flyover: తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్.. స్వాగత తోరణం ఏర్పాటు | Swetchadaily | Telugu Online Daily News
Telugu Thalli Flyover (IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Telugu Thalli Flyover: తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్.. స్వాగత తోరణం ఏర్పాటు

Telugu Thalli Flyover: తెలుగు తల్లి ప్లై ఓవర్‌ను (Telugu Thalli Flyover)  తెలంగాణ తల్లి ప్లై ఓవర్‌గా మార్చుతూ స్వాగ‌తతోర‌ణం ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం. గ‌త నెల 24న జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో పేరు మార్పుపై చ‌ర్చించి తీర్మానం చేశారు. ఈ నిర్ణ‌యానికి అనుగుణంగా ప్ర‌భుత్వం పేరు మార్పును ఆమోదిస్తూ ఇరువైపులా ప్ర‌త్యేకంగా స్వాగ‌త బోర్డుల‌ను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ త‌ల్లి ఫ్లైఓవ‌ర్‌గా మారిన తెలుగు త‌ల్లి ఫ్లైఓవ‌ర్‌కు దాదాపు రెండున్నర దశాబ్దాల చ‌రిత్ర ఉంది.

 Also Read: PCC Mahesh Kumar Goud: ఆదిత్య కన్స్రక్షన్ పై పూర్తి స్థాయిలో ఎంక్వైయిరీ.. మహేష్​ కుమార్ గౌడ్

సచివాలయం ప్లై ఓవర్ గా పేరు

1996 లో సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హ‌యాంలో ప్లై ఓవర్ నిర్మాణం కోసం శంఖుస్దాపన చేసి, ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని పూర్తి చేశారు. అప్పుడు దీనికి సచివాలయం ప్లై ఓవర్ గా పేరు పెట్టారు. ఆ స‌మ‌యంలో పురపాలక శాఖ మంత్రిగా తమ్మినేని సీతారాం కాగా, కార్మిక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పి.జనార్దన్ రెడ్డిలు ఉన్నారు.

తెలుగుతల్లి ప్లైఓవర్ గా నామకరణం

2005 జనవరిలో ముఖ్యమంత్రిగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగిన సమయంలో ఈ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో ఈ ఫ్లైఓవ‌ర్‌కు తెలుగుతల్లి ప్లైఓవర్ గా నామకరణ చేశారు. తాజాగా 2025 సంవత్సరం సెప్టెంబరు లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ప్లై ఓవర్ గా నామకరణం చేశారు. ఇందుక సంబంధించి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోగా, వెంట‌నే క‌మిటీ ఆమోదించి ప్ర‌భుత్వానికి పంపగా, సర్కారు ఆమోదం తెలపటంతో పేరును మార్చుతూ బోర్డునే ఏర్పాటు చేశారు.

 Also Read: Quetta Blast: పాకిస్థాన్‌లో శక్తివంతమైన కారుబాంబు పేలుడు.. 13 మంది దుర్మరణం

Just In

01

Gadwal District: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్కంఠ.. అందరి చూపు అటువైపే..?

Ind Vs NZ 1st ODI: తడబడినా తేరుకున్న కివీస్ బ్యాటర్లు.. తొలి వన్డేలో భారత్‌ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

PK Martial Arts Journey: టైగర్.. పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు!

Excise Scandal: కల్తీ మద్యం కేసులో.. ఎక్సైజ్ చేతివాటంపై కలకలం

Murder Case: భర్త హత్యను కళ్లారా చూసింది.. ఆ కేసుపై విచారణ జరుగుతుండగా ఊహించని ఘోరం