Collector Rahul Raj: జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ కన్వీనర్ కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఉపాద్యాయ సంఘాల నాయకులు, విద్యారిని విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఎంచుకున్నటువంటి థీమ్,సబ్ థీమ్లు అభిరుచులకు తగ్గట్టుగా ఈ కాలానికి, మన దేశానికి అవసరమైనటువంటివిగా ఉన్నాయన్నారు. విద్యార్థులు కేవలం సైన్స్ చదవడం కాకుండా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
పోటీ పరీక్షలకు శిక్షణ
స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ఏ ఐ ఆప్స్(Chat GPT, Gemini etc )ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా సరైన సూచనలు ఇచ్చి మనం పొందగలిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని మంచికి ఉపయోగించి తమ జ్ఞానాన్ని పెంపొందించుకొని మంచి భవిష్యత్తు పొందాలని ఆయన సూచించారు. పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని మన పాఠశాల విద్యార్థులందరికీ కోర్స్ మెటీరియల్ పొందే అవకాశం కల్పించిందని తమ వద్ద ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉపాధ్యాయుల సహకారంతో ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వాలా కి సంబంధించిన బోధన వీడియోలు వీక్షించాలని, కాలాన్ని వృధా చెయ్యరాదని, స్మార్ట్ ఫోన్ ను మంచి పనులకు ఉపయోగించాలని ఆయన అన్నారు. సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులని కలెక్టర్ ప్రశసించారు.
Also Read: Bigg Boss 9 Telugu: భరణి, కళ్యాణ్ మధ్య బిగ్ ఫైట్.. బిత్తరపోయిన హౌస్.. ఎంత పనిచేశావ్ బిగ్ బాస్!
ఆసక్తికి అనుగుణంగా..
జిల్లా విద్యాశాఖ అధికారి విజయ మాట్లడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తమ తమ అభిరుచి, ఆసక్తి అనుగుణంగా తమ కోర్స్లు ఎంచుకొని జీవితంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఇందుకు గాను ఉన్న సౌకర్యాలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రదర్శన గదులలోని ప్రాజెక్టలని.. కలెక్టర్ ప్రారంభించి వీక్షించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, పరికరాలను వీక్షించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్ 425 ఇన్స్పైర్ 50 ప్రాజెక్ట్ లను ప్రదర్శించారు.
Also Read: Balayya Fan: బాలయ్య బాబు అభిమాని చేసింది చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏం క్రేజ్ మామా..

