Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు రోజు రోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇంకా రెండు వారాలే మిగిలి ఉండటంతో ప్రతి ఒక్కరిలోనూ టెన్సన్ మొదలైంది. 89వ రోజు ఫైనల్ సభ్యత్వం కోసం చేసే రణరంగంలో టాస్కులు చాలా కాంప్లికేట్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అందరిలో టైటిల్ గెలవాలి అన్న తాపత్రయం కనిపిస్తుంది. 89 వ రోజు టాస్క్ లో రీతూ చౌదరి విజయం సాధించింది అయితే ఆ విజయం సరైనది కాదు అని భరణి వారించారు. ఎందుకుంటే.. పక్కన ఉన్న పాత సామాను కుప్పలో త్రిభుజాలు చతుర్భుజాలు.. ఉన్నాయి. వాటిని వెతికి తీయాలి దేనికి దానిని పెట్టాలి అయితే అందులో ఒకటి త్రిభుజం కాదు చతుర్భుజం. దీనిని గమనించిన భరణి సంచాలక్ కు జరిగిన విషయం చెబుతాడు. అయితే అదే సందర్భంలో రీతూ చౌదరిని విన్నర్ గా ప్రకటించడం సబబు కాదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఈమె ఓడిపోయింది. అంటూ చెబుతాడు. అదే సందర్భంలో అక్కడే ఉన్న రీతూ చౌదరి, భరణి గారు ఎందుకు నా పేరు తీస్తున్నారు అని అంటుంది. దానికి భరణి నువ్వు చేసిందే కదా అందుకే అంటున్నా అనడంతో ఆమె కోపగించుకుంది. భరణి వైపు వేలు చూపిస్తూ సీరియస్ అయింది. నా గెలుపు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని కొంత సేపు గొడవ తర్వాత తిట్టుకుంటూ లోనికి వెళ్లి పోతుంది.
Read also-Divya Toxicity: బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి దివ్య ఖోస్లా.. ఎందుకంటే?
తర్వాత కొంత సేపటికి భరణి ఇక్కడ ఏదో జరుగుతుంది, అందరినీ గమనిస్తున్నా గేమ్ లో షూ చూపించి గేమ్ ఆడటం.. దానికి సంబంధించి వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి అనడంతో పక్కనే ఉన్న పవన్ భరణి వైపు సీరియస్ గా చూశాడు. తర్వాత కూడా భరణి ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఎంత చీటింగ్ జరిగింది.. అన్నీ తెలుస్తాయి.. అనడంతో మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలుసు ఆ రూమ్ లో ఉన్న వీడియోలు నేను చూశాను, ఈ విషయం కళ్యాణ్ కు కూడా తెలీదు.. అసలు మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు.. అంటూ భరణి మీద పవన్ ఫైర్ అయ్యాడు.. భరణి నేను నిన్నుఅనలేదు నీ పేరు చెప్పలేదు.. నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తున్నా అంతే.. అంటూ చెప్పుకొచ్చారు. అయినా పవన్ వినకుండా భరణి పై సీరియస్ అయ్యాడు. భరణి పవన్ ల విషయం తారా స్థాయికి చేరుకుంది. భరణి అయితే నీ పేరు తేకుండా నాపై ఎందుకు అరుస్తున్నావంటూ పవన్ పై సీరియస్ అయ్యారు. అసలు అక్కడ ఏం జరిగింది? పవన్, భరణిలు ఎందుకు సీరియస్ అయ్యారు? ఇలాంటి వాటికి సమాధానాలు తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే..

