Divya Toxicity: బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దివ్య ఖోస్లా..
Divya-Khosla’s(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Divya Toxicity: బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి దివ్య ఖోస్లా.. ఎందుకంటే?

Divya Toxicity: బాలీవుడ్ నటి, దర్శకురాలు దివ్య ఖోస్లా సినీ పరిశ్రమలో తన అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో పాల్గొన్న ఆమె, బాలీవుడ్‌లో ఉన్న విషపూరిత వాతావరణం (Toxicity) గురించి మాట్లాడారు. సినిమా పరిశ్రమలో ఉన్న ఒత్తిడి, నిరంతరం అందంగా కనిపించాలనే ఆందోళన మధ్య మానసికంగా దృఢంగా ఎలా ఉండగలుగుతున్నారని ఒక అభిమాని ప్రశ్నించగా, దివ్య ఖోస్లా స్పందిస్తూ.. “నాకు కూడా అనిపిస్తుంది, బాలీవుడ్ అనేది చుట్టూ మొసళ్లు ఉన్న ప్రదేశం లాంటిది, మీరు వాటి మధ్య నుంచి మీ దారిని వెతుక్కుంటున్నట్లు ఉంటుంది.” అని అన్నారు తాజాగా ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

Read also-Sushanth Meenakshi: ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించడంతో వారిపై పెళ్లి పుకార్లు మళ్లీ షురూ!

నిజాయితీనే నా సూత్రం

ఈ కష్టభరితమైన వాతావరణాన్ని ధైర్యంగా అంగీకరిస్తూనే, ఆమె తన వ్యక్తిగత సూత్రాలకు కట్టుబడి ఉంటానని నొక్కి చెప్పారు. “నాకు ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాకు నేను నిజాయితీగా ఉండటం. పని కోసం నేను నా ఆత్మను ఎప్పటికీ అమ్ముకోను. జరిగితే సరే, జరగకపోయినా సరే. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, మీతో పాటు తీసుకెళ్లడానికి మంచి కర్మల రికార్డు ఉండాలి,” అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల దివ్య ఖోస్లా, ఆమె భర్త, టి-సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్ మధ్య విడాకులు జరిగాయని మీడియాలో పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. AMA సెషన్‌లో దీనిపై ప్రశ్న ఎదురైంది. “మీరు విడాకులు తీసుకున్నారా?” అని ఒక యూజర్ అడిగినప్పుడు, దివ్య నవ్వుతూ, చికాకును వ్యక్తం చేస్తూ బదులిచ్చారు.. “లేదు, కానీ మీడియా మాత్రం నిజంగా అదే కోరుకుంటోంది.” దివ్య ఖోస్లా, భూషణ్ కుమార్ 2005 లో వివాహం చేసుకున్నారు, వీరికి ఒక కుమారుడు (రూహాన్) ఉన్నాడు.

Read also-Mahesh Debts: బాలయ్య బాబు ‘అఖండ 2’ వాయిదా పడటానికి కారణం ఇదే?.. అసలు ఏం జరిగిందంటే?

అత్యంత ఇష్టమైన అనుభవం

తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన షూటింగ్ అనుభవం గురించి అడగ్గా, దివ్య వెంటనే ‘సావి’ సినిమా పేరు చెప్పారు. యూకేలో మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో 42 రోజుల పాటు నాన్-స్టాప్ షూటింగ్ జరిగిందని, అయితే నిర్మాణ సంస్థ చక్కగా నిర్వహించడం వల్ల ఇది తన ఇతర సినిమాలతో పోల్చడానికి ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని ఆమె తెలిపారు. తాజాగా ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వివాదాలకు దారితీశాయి. ఇండస్ట్రీ మొత్తం దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలి మరి.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు