Mahesh Debts: బాలయ్య బాబు హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మకమైన సినిమా ‘అఖండ 2’ విడదల ఆగిపోయింది. దీనికి ఆర్టిక కారణాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ సినిమాకు సంబంధించి కొంత డబ్బును తీసి వేరే వాటికి వాడటం, హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోవడం లాంటివి కారణాలు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్‌లో కొత్త సినిమాలు విడుదల కావడం, వందల కోట్ల బిజినెస్ జరగడం మామూలే. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లాప్ అయిన లేదా ఆర్థిక నష్టాలను మిగిల్చిన పెద్ద హీరోల చిత్రాల సమస్యలు ఇప్పటికీ పరిశ్రమను వెంటాడుతున్నాయని, అవి ఏకంగా కొత్త ప్రాజెక్టుల విడుదలను సైతం అడ్డుకుంటున్నాయని ఇటీవల జరిగిన రెండు ముఖ్య సంఘటనలు రుజువు చేశాయి. ముఖ్యంగా ‘సూపర్ స్టార్’ మహేష్‌బాబు గతంలో నటించిన కొన్ని భారీ చిత్రాల ఆర్థిక లావాదేవీలు బకాయిలు ఇప్పటికీ సమస్యగా నిలుస్తున్నాయి.
Read also-Smriti Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదాపై పలాష్ ముచ్ఛల్ సోదరి పాలక్ ఎమోషనల్ కామెంట్స్
‘స్పైడర్’ వలయంలో ‘క్రాక్’ ఆలస్యం
రవితేజ కెరీర్‌లో కీలకమైన చిత్రం క్రాక్ 2021లో సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఊహించని జాప్యం జరిగింది. ఈ ఆలస్యం వెనుక ప్రధాన కారణం మహేష్‌బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ద్విభాషా చిత్రం స్పైడర్ బకాయిలు అని సినీ వర్గాల్లో బలమైన చర్చ జరిగింది. ‘స్పైడర్’ అంచనాలను అందుకోలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను క్లియర్ చేయడంలో జరిగిన జాప్యం, ‘క్రాక్’ విడుదలకు అవసరమైన ఆర్థిక క్లియరెన్స్‌లకు అడ్డుపడింది. ఫలితంగా, విడుదల రోజు ఉదయం షోలు రద్దయ్యే పరిస్థితి ఏర్పడి, ఆ సినిమాకు కొంత నెగెటివ్ ఇంపాక్ట్ పడింది.
‘అఖండ 2’ ప్రీమియర్‌కు ‘1: నేనొక్కడినే’, ‘ఆగడు’ బ్రేక్!
తాజాగా, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2) చిత్రం ప్రీమియర్ షోలు రద్దు కావడం వెనుక కూడా మహేష్‌బాబు పాత సినిమాలే కారణమవడం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ #1Nenokkadine (1: నేనొక్కడినే), అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు చిత్రాల పంపిణీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాకపోవడం వల్లే ‘అఖండ 2’ ప్రీమియర్స్ షోలకు బ్రేక్ పడిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, వాటి ఆర్థిక వ్యవహారాలు చాలా ఏళ్లుగా రగులుతూనే ఉన్నాయి.
Read also-Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
బకాయిల చట్రంలో టాలీవుడ్ విడుదల ప్రణాళికలు
ఒక పెద్ద స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే, ఆ నష్టం కేవలం నిర్మాతలకు లేదా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే పరిమితం కాదు. ఆ నష్టాలను భర్తీ చేసే క్రమంలో.. పంపిణీదారులు కొత్త సినిమా హక్కులు కొనుగోలు చేసినా, పాత నష్టాల క్లియరెన్స్ అయ్యే వరకు కొత్త సినిమా ప్రదర్శనకు అంగీకరించకపోవడం. పాత అప్పులు తీరకపోవడం వల్ల ఫైనాన్షియర్లు కొత్త చిత్రాల ఫైనాన్సింగ్‌కు అడ్డంకులు సృష్టించడం. చివరి నిమిషంలో క్లియరెన్స్‌లు ఆగిపోయి, ముఖ్యమైన రిలీజ్ డేట్లు లేదా ప్రీమియర్ షోలు రద్దు కావడం. ఇలా, మహేష్‌బాబు గత చిత్రాలు తెచ్చిన ఆర్థిక చిక్కులు.. ఇండస్ట్రీలోని కీలకమైన బ్యానర్ల, డిస్ట్రిబ్యూటర్ల లావాదేవీల మీద, ముఖ్యంగా కొత్త చిత్రాల విడుదల ప్రణాళికల మీద నేరుగా ప్రభావం చూపుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ ఆర్థిక వలయం నుంచి టాలీవుడ్ బయటపడాలంటే, పాత ప్రాజెక్టుల బకాయిలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

