Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీ‌లో
Shah Rukh and Aryan Khan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీ‌లో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?

Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన మాదకద్రవ్యాల కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలియంది కాదు. తాజాగా ఆర్యన్ ఖాన్ బెంగళూరు (Bengaluru) పర్యటనలో చేసిన పని, కాంట్రవర్సీగా మారింది. నవంబర్ 28న బెంగళూరు నగరానికి చేరుకున్న ఆర్యన్ ఖాన్ ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం పబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పబ్ బయట ఆయనను చూడడానికి వచ్చిన అభిమానుల పట్ల ఆయన ప్రవర్తన తీవ్ర వివాదానికి దారితీసింది. ఆర్యన్ ఖాన్ పబ్ బాల్కనీపై నిలబడి, తనను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశిస్తూ రెండు చేతుల మిడిల్ ఫింగర్ చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్యన్ ఖాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యత గల స్టార్ యాక్టర్ కుమారుడు అయ్యిండి, పబ్లిక్‌లో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

Also Read- Breaking News: ‘అఖండ 2’ ప్రీమియర్స్ క్యాన్సిల్.. క్షమాపణలు చెప్పిన నిర్మాతలు

మంత్రుల కుమారుల సమక్షంలో సంఘటన

ఆర్యన్ ఖాన్ ఈ పబ్ ఈవెంట్‌కు కర్ణాటక మంత్రి బీ.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్, అలాగే బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఎన్.ఎ. హారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్‌తో కలిసి వచ్చారు. ఆర్యన్ ఖాన్ ఆ విధంగా ప్రవర్తిస్తున్న సమయంలో జైద్ ఖాన్, మహమ్మద్ నలపాడ్‌లు నవ్వుతూ కనిపించడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ ఘటన అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్‌ వద్ద జరిగింది. పబ్లిక్‌లో ఆర్యన్ ఖాన్ అభ్యంతరకరంగా ప్రవర్తించినప్పటికీ, ఇప్పటి వరకు బెంగళూరు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఇదే చర్యను ఒక సామాన్య పౌరుడు చేసి ఉంటే పోలీసులు ఎలా వ్యవహరించి ఉండేవారు అని సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు.

Also Read- Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

న్యాయం అందరికీ సమానం

‘ఒక ప్రభావవంతమైన వ్యక్తి కుమారుడు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారా?’ అని ప్రశ్నిస్తూ, న్యాయం అందరికీ సమానంగా ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో, బెంగళూరు పోలీసులు ఈ సంఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆర్యన్ ఖాన్ ప్రవర్తనపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి కానీ, లేదా అతని కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక వివరణ ఇంకా రాలేదు. ఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు, అలాగే షారుఖ్ ఖాన్ అండ్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. ఏం జరుగుతుందో? ప్రస్తుతం ఈ వీడియో‌పై నెటిజన్ల కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?