Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 88వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 88) కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం టాస్క్‌లు, ఛాలెంజ్‌లు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఇమ్మానుయేల్, కళ్యాణ్, భరణి ఈ రేసులో విజయం సాధించారు. తాజాగా ఈ రేసులోకి రీతూ (Rithu) కూడా చేరినట్లుగా తెలుస్తుంది. సంజన, తనూజ, సుమన్ శెట్టి, పవన్‌లు ఛాలెంజ్‌లో ఓడిపోయి రేసు నుంచి అవుటయ్యారు. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. చివరి ఛాలెంజ్ అంటూ హౌస్‌మేట్స్‌కి షాకిచ్చారు. గురు, శుక్రవారం జరిగే టాస్క్‌లతో తొలి ఫైనలిస్ట్‌ని బిగ్ బాస్ సెలక్ట్ చేయబోతున్నారు. ఆ విషయమైతే క్లారిటీగా తెలుస్తోంది. కాకపోతే.. ఎవరు తొలి ఫైనలిస్ట్ అవుతారనేది మాత్రం ప్రతి నిమిషానికి మారిపోతుంది. తాజాగా వచ్చిన ప్రోమోని చూస్తే మాత్రం ఈ రేసులో నలుగురు ఉన్నట్లుగా క్లారిటీ అయితే వచ్చేసింది. ఆ నలుగురు ఎవరనే విషయానికి వస్తే..
బ్యాలెన్స్ చేయరా డింభక
‘మీరంతా ఇప్పటి వరకు దేని కోసం అయితే పోరాడుతున్నారో.. దానిని రివీల్ చేసే సమయం వచ్చేసింది’ అని చెబుతూ తాజాగా వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ ఒక షీల్డ్‌ని రివీల్ చేశారు. ‘‘అది కేవలం ఫస్ట్ ఫైనలిస్ట్‌కు లభించే గౌరవమే కాదు, ఆ షీల్డ్.. కఠిన పరిస్థితులను దాటి.. మీ సత్తాను పరీక్షించే సవాళ్లను ఎదుర్కొంటూ.. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారే మీ ప్రయాణానికి ప్రతీక. అది కేవలం మీలో ఒకరికి మాత్రమే లభిస్తుంది. ఇదే ఆఖరి ఛాలెంజ్.. తర్వాత యుద్ధాలు మాత్రమే ఉంటాయి. ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న చివరి ఛాలెంజ్.. ‘బ్యాలెన్స్ చేయరా డింభక’. తాము ఫస్ట్ ఫైనలిస్ట్‌గా చూడకూడదనుకుంటున్న పోటీదారుల స్టిక్‌పై కాయిన్స్, టోకెన్స్ యాడ్ చేయాలి. ఒకవేళ కాయిన్స్ కానీ, టోకెన్స్ కానీ కింద పడితే మీరు ఛాలెంజ్‌లో ఒడినట్టే..’’ అని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు.
Also Read- Balakrishna: మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్!
వారిద్దరిలో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు?
ఈ ఛాలెంజ్‌ను ఇమ్మానుయేల్, రీతూ, కళ్యాణ్ ఆడుతున్నారు. ఇందులో రీతూ గెలిచినట్లుగా తెలుస్తోంది. రీతూ గెలిచి, ఆల్రెడీ గెలిచిన లిస్ట్‌లో ఉన్న ఇమ్మానుయేల్, భరణి, కళ్యాణ్‌తో టాస్క్ ఆడాల్సి ఉంది. వారిలో ఎవరిని రీతూ సెలక్ట్ చేసుకుంటుంది. రీతూ, రీతూతో పాటు వచ్చే పోటీదారుడు మాత్రమే ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో (Finalist Race) ఉంటారని తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగే టాస్క్‌లో ఎవరైతే విన్నర్ అవుతారో.. వారికే షీల్డ్ లభిస్తుందనేలా టాక్ నడుస్తుంది. రీతూ గెలిస్తే రీతూ ఫస్ట్ ఫైనలిస్ట్, లేదంటే రీతూ సెలక్ట్ చేసుకున్న వారు గెలిస్తే వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు. ప్రస్తుతానికైతే వినిపిస్తున్నది ఇదే. ఈ గ్యాప్‌లో బిగ్ బాస్ ఏమైనా మార్చినా మార్చవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
