Balakrishna: ‘అఖండ 2’ చెన్నై వేడుకలో బాలయ్య వ్యాఖ్యలు వైరల్!
Akhanda 2 Chennai Event (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Balakrishna: మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్!

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam) చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఆల్రెడీ ఓవర్సీస్‌కు కంటెంట్ రీచ్ అయినట్లుగా కూడా అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ విషయంలో యమా దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా చెన్నైలో చిత్ర టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలయ్య కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Mana Shankara Vara Prasad Garu: వెంకీమామ పోస్ట్‌కు చిరు, అనిల్ రావిపూడి రిప్లయ్ చూశారా!

సనాతన ధర్మం అంటే ఏంటో నేర్చుకుంటారు

‘‘నేను ఇక్కడే (చెన్నై) పుట్టాను. అందువల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. నిజంగా దేవుని దయ, ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యమవదు. ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు.. అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఇందులో సనాతన ధర్మం పరాక్రమం ఎలా ఉంటుందో చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం అంటే ఏంటో నేర్చుకుంటారు. ఈ సినిమా ఒక ఎన్‌సైక్లోపీడియా. మా నాన్న నా గురువు, దైవం. ఆయన పురాణాలు, సామాజిక, ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలెన్నో చేశారు. నేను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాను. బోయపాటితో నాది హిట్ కాంబినేషన్. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటమనేది నా తల్లితండ్రులు, అభిమానుల ఆశీస్సులని భావిస్తున్నాను. ‘అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌’ వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ కూడా ఆ జాబితాలో చేరుతుంది. డిసెంబర్ 5న వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలి’’ అని కోరారు.

Also Read- Pushpa 2: ‘కొన్నిచివా, నిహోన్ నో తోమో యో’.. జపాన్‌‌కు ‘పుష్ప రాజ్’ సవాల్.. రిలీజ్ ఎప్పుడంటే?

పరమశివుడే ప్రత్యక్షమై సందేశం ఇచ్చినట్లుగా..

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘అఖండ 2: తాండవం’ రీజినల్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా. ఇది భారతదేశ ఆత్మ. అందరూ ఈ సినిమా చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌ని కమర్షియల్‌గా ఒక నూతన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే ప్రత్యక్షమై ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షియల్‌గా చాలా అద్భుతంగా చూపించడం జరిగిందని తెలిపారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట తమ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన