Mana Shankara Vara Prasad Garu: వెంకీకి చిరు, అనిల్ రిప్లయ్..
Mana Shankara Vara Prasad Garu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mana Shankara Vara Prasad Garu: వెంకీమామ పోస్ట్‌కు చిరు, అనిల్ రావిపూడి రిప్లయ్ చూశారా!

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వెంకీమామ చేసిన పోస్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రిప్లయ్ ఇచ్చారు. ముందుగా వెంకీ తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..

Also Read- Pushpa 2: ‘కొన్నిచివా, నిహోన్ నో తోమో యో’.. జపాన్‌‌కు ‘పుష్ప రాజ్’ సవాల్.. రిలీజ్ ఎప్పుడంటే?

నన్ను అబ్బురపరిచింది

‘‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నిమిత్తం నా పార్ట్ షూటింగ్ ఈరోజుతో పూర్తయ్యింది. ఇది నాకు ఎంతో అద్భుతమైన అనుభవం! నేను ఎంతగానో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం’’ అని వెంకీమామ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వెంకీ చేసిన ఈ ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అవుతూ.. ‘‘మై డియర్ వెంకీ… మై బ్రదర్, మనిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు ఎంతో మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ నన్ను అబ్బురపరిచి నాలో కొత్త ఉత్సాహం నింపింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది’’ వెల్లడించారు. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి పోస్ట్‌లని కోట్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి పోస్ట్. ఆయన తన ట్వీట్‌లో..

Also Read- Dil Raju: పవన్ కళ్యాణ్‌తో సినిమా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు.. ఈ క్లారిటీ అందుకేనా?

ఇదొక గొప్ప గౌరవం

‘‘కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అలా దాగిన వాటిని అకస్మాత్తుగా సినిమా నిజం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో పక్కపక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్‌తో మెరిసిన ఆ క్షణం.. నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ఈ ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం తన పార్ట్‌ని పూర్తిచేసి, ఈ అందమైన కలను సాకారం చేసిన డియర్ వెంకీ సర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని అనిల్ రావిపూడి తన ఆనందాన్ని షేర్ చేశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌ని సంపాదించి ఇప్పటికే ఈ చిత్రంపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?