Dil Raju: పవన్ కళ్యాణ్‌తో సినిమా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు!
Dil Raju and Pawan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Dil Raju: పవన్ కళ్యాణ్‌తో సినిమా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు.. ఈ క్లారిటీ అందుకేనా?

Dil Raju: ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తర్వాత మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan)తో నిర్మాత దిల్ రాజు (Dil Raju) తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో సినిమా చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ‘అర్జున’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒకటే వార్తలు. ఈ సినిమాతో పాటు ఈ బ్యానర్‌లో మరికొన్ని సినిమాల గురించి కూడా ఇదే రకంగా వార్తలు వినిపిస్తుండటంతో.. తాజాగా ఈ వార్తలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మా బ్యానర్‌పై రాబోయే సినిమాలు అంటూ కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని దిల్ రాజు అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Also Read- Bigg Boss Telugu 9: మూడో ఛాలెంజ్.. ముగ్గురు వెళ్లడానికీ గోలే.. మేము ఎవరికీ ఓట్ వేయం!

ఆ వార్తల్లో నిజం లేదు..

ఈ ప్రకటనలో.. ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి రాబోయే సినిమాల విషయంలో ఈ మధ్య రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెట్టి కొంత మంది ఇప్పుడు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా తెలియజేస్తాము. దయచేసి అప్పటి వరకు మా నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, మేము ధృవీకరించని వార్తలను మీ మీడియాలలో ప్రచారం చేయవద్దని కోరుతున్నాము” అని దిల్ రాజు తెలియజేశారు.

Also Read- Samantha Marriage: భూత శుద్ధి ప్రక్రియలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోవడానికి కారణమిదేనా?

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కారణమా..

దిల్ రాజు ఈ ప్రకటన అనంతరం.. వార్తలు మరోలా వినిపిస్తున్నాయి. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన అన్న మాటలను వక్రీకరించి కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో.. అవే నిజమనుకుని, పవన్ కళ్యాణ్‌పై దాడికి దిగారు. వెంటనే పవన్ కళ్యాణ్ సారీ చెప్పకపోతే.. ఆయన సినిమాలను తెలంగాణలో ప్రదర్శనకానివ్వం.. అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో చేసి రిస్క్ తీసుకునే కంటే, కామ్‌గా ఉంటే బెటర్ అని దిల్ రాజు అండ్ టీమ్ నిర్ణయం తీసుకుందని, అందుకే ఇంతగా వివరణ ఇచ్చారనేలా టాక్ మొదలైంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు.. తెలంగాణ నాయకుల గురించే కానీ, ప్రజల గురించి కాదు. అయినా కూడా, ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కొందరు నాయకులు రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..

Putin’s Aurus Senat Car: భారత్‌లో పుతిన్ పర్యటన.. అందరి కళ్లు ఆ కారు పైనే.. వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Sathupalli: అర్బన్ పార్క్‌లో దుప్పుల వేట.. అటవీ శాఖ దర్యాప్తు పెరుగుతున్న అనుమానాలు.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో?

Akhanda 2 Issues: విడుదలకు ఒక్క రోజు ముందు చిక్కుల్లో బాలయ్య ‘అఖండ 2’.. సినిమా ఆపాలన్న కోర్టు!