Pushpa 2: జపాన్‌‌కు ‘పుష్ప రాజ్’ సవాల్.. రిలీజ్ ఎప్పుడంటే?
Allu Arjun in Pushpa 2 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Pushpa 2: ‘కొన్నిచివా, నిహోన్ నో తోమో యో’.. జపాన్‌‌కు ‘పుష్ప రాజ్’ సవాల్.. రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) హీరోగా, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Director Sukumar) రూపొందించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule).. ఇప్పుడు జపాన్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం, జపనీస్ ప్రేక్షకులను పలకరించేందుకు 16 జనవరి, 2026న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. దీంతో, మేకర్స్ ఇప్పటికే నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) అనే టైటిల్‌తో ఈ సినిమా జపాన్‌లోని థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి.. అక్కడి స్థానిక పంపిణీ సంస్థలైన గీక్ పిక్చర్స్ (Geek Pictures), షోచికూ (Shochiku) విడుదల చేస్తున్నాయి.

Also Read- Victory Venkatesh: శంకరవర ప్రసాద్‌తో.. నా పార్ట్ పూర్తి చేశా! వెంకీమామ పోస్ట్ వైరల్..

‘కొన్నిచివా, నిహోన్ నో తోమో యో’

జపాన్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ, చిత్రబృందం ప్రత్యేకంగా ‘కొన్నిచివా, నిహోన్ నో తోమో యో’ (నమస్కారం, జపాన్ స్నేహితులారా).. అనే జపనీస్ గ్రీటింగ్‌తో ఈ విడుదలను ప్రకటించింది. ఈ సందర్భంగా, అల్లు అర్జున్ మాస్ స్వాగ్‌ను ప్రదర్శించే సరికొత్త పోస్టర్‌తో పాటు, ప్రత్యేకంగా డబ్బింగ్ చేయబడిన జపనీస్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారతీయ సినీ చరిత్రలో 5 డిసెంబర్, 2024న ఐదు భాషల్లో విడుదలై ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచిన ‘పుష్ప 2’ అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఏ విధంగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జపనీస్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాల్సి ఉంది.

Also Read- Rashmika Mandanna: ‘ఏఐ’ దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన.. నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్

క్రెడిట్ మొత్తం సుకుమార్‌కే..

ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రశంసలపై అల్లు అర్జున్ ఎప్పుడూ వినయంగా స్పందిస్తూ వచ్చారు. ‘‘ఈ మొత్తం విజయం, ఈ ఘనత అంతా ఒకే ఒక్క వ్యక్తికి చెందుతుంది’’ అని తన దర్శకుడు సుకుమార్‌కు ఈ క్రెడిట్ ఇస్తూ వస్తున్నారు. సుకుమార్ విజన్ వల్లే సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని, తన దర్శకుడి పట్ల ఆయన వినయ విధేయతను చాటాడు. వాస్తవానికి ‘పుష్ప 2’ను జపాన్‌లో విడుదల చేసి.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు గత ఏడాదిలోనే ప్లాన్ చేశారు. భారత సరిహద్దులను దాటి ఈ సినిమాను విస్తరించాలని చిత్రబృందం నిర్ణయించుకుని, పూర్తిగా జపనీస్‌లోకి ఈ సినిమాను అనువాదం చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఊర మాస్ నటనతో పాటు.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, ఫాహద్ ఫాజిల్ పాత్ర, అలాగే రష్మిక మందన్న నటన – గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన