Victory Venkatesh: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) వంటి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీస్టారర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) నుంచి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు వెంకీమామ. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లుగా విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం వెంకీమామ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో భాగమవడమనేది ‘అద్భుతమైన అనుభవం’ అని, ఇది తనకు ఎన్నో ‘మధురమైన జ్ఞాపకాలను’ మిగిల్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, తన అభిమాన నటుడైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడం గురించి వెంకటేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘నా ఫేవరేట్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడం అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది’ అని చెబుతూ, మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా కాలంగా ఎదురు చూశానని పేర్కొన్నారు.
Also Read- Rashmika Mandanna: ‘ఏఐ’ దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన.. నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్
ఎప్పుడో జరగాల్సింది
ఈ అద్భుతమైన కలయికకు కారణమైన దర్శకుడు అనిల్ రావిపూడికి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ‘మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పుడో జరగాల్సింది, ఈ ప్రత్యేకమైన చిత్రం కోసం అనిల్ రావిపూడి (Anil Ravipudi) చివరకు మమ్మల్ని కలిపినందుకు చాలా సంతోషిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని, అదే సమయంలో అనిల్ రావిపూడిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వెంకటేష్ తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేయడంతో, పోస్ట్-ప్రొడక్షన్ పనులు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి టాకీ పార్ట్ పూర్తయినట్లుగా టాక్ నడుస్తుంది. దీనిపై చిత్రయూనిట్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
Also Read- Dil Raju: పవన్ కళ్యాణ్‌తో సినిమా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు.. ఈ క్లారిటీ అందుకేనా?
సంక్రాంతికి సిద్ధమైపోండి
ఇంకా ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో కూడా వెంకటేష్ స్పష్టతనిచ్చారు. ‘సంక్రాంతి 2026ని మీ అందరితో థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతగానో వేచి చూస్తున్నాను’ అని ఆయన ప్రకటించారు. దీన్ని బట్టి, ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు పక్కా అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లయింది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు వెంకటేష్ చేసిన ట్వీట్ మరింత ఆతృతను పెంచుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా సంక్రాంతి బరిలో రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Wrapped up my part today for #ManaShankaraVaraPrasadGaru, and what an incredible experience it has been! Working with my favourite @KChiruTweets was an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with ‘Megastar… pic.twitter.com/KAzWcXGBeK
— Venkatesh Daggubati (@VenkyMama) December 3, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
