Balayya Fan: గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య బాబు అంటేనే క్రేజ్, ఆ క్రేజ్ ఎలాంటిది అంటే.. ఆయన పేరు ఎత్తందే తెలుగు వారికి పొద్దు పోదు. ఇక ఆయన అభిమానుల గురించి అయితే చెప్పనక్కర్లుదు, వారిని అభిమానులు అనడం కన్నా భక్తులు అనడమే రైట్ అవుతుంది. అయితే నందమూరి బాలయ్యపై ఉన్న అభిమానాన్ని పలువురు పలు రకాలుగా వ్యక్త పరుస్తుంటే ఓ అభిమాని మాత్రం అందరి ఊహలను దాటేశాడు. ఎందుకంటే అతను చేసింది చూస్తే బాలయ్య అభిమాని అనే విధంగా చేశాడు. ఇంతకు బాలయ్య అభిమాని ఏం చేశాడు అంటే?.. పాలతో, నెతితో, తెనెతో అభిషేకాల రోజులు పోయాయి అంటూ, ఏకంగా మద్యంతో అఖండ 2 పోస్టర్ కు అభిషేకం చేశాడు. హైదరాబాదు అమీర్ పేట దగ్గర లో ఉన్న మధురానగర్ లో బాలయ్య బాబు వీరాభిమాని మాన్సన్ హౌస్ మందుతో ‘అఖండ 2’ పోస్టర్ కు అభిషేకం చేశాడు. ఇది చూసిన అక్కడి ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బాలయ్య బాబు క్రేజ్ అంటే అలా ఉంటుంది అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read also-Bigg Boss 9 Telugu: భరణి, కళ్యాణ్ మధ్య బిగ్ ఫైట్.. బిత్తరపోయిన హౌస్.. ఎంత పనిచేశావ్ బిగ్ బాస్!
బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న అఖండ 2 తాండవం సినిమా ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడిందలని నిర్మాాతలు అధికారిక సోషల్ మీడియా హ్యాడిల్ లో తెలియజేశారు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. అంతా అయిపోయి విడుదల చివరిలో టాలీవుడ్ బడా సినిమా ఆగిపోవడంపై అభిమానులు నిర్మాతనలపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకూ వాటిని పరిష్కరించకుండా నిర్మాతలు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. ముందు ఒక ప్రీమియర్ షో మాత్రమే రద్దు అనుకున్న అభిమనులకు మరో ఝలక్ తగిలింది. ఏకంగా విడుదలనే పోస్ట్ పోన్ చేస్తూ నిర్మాతలు తీసుకున్నా నిర్ణయంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Read also- Smriti Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదాపై పలాష్ ముచ్ఛల్ సోదరి పాలక్ ఎమోషనల్ కామెంట్స్
కనీసం ఒక రోజు లేటు అయినా విడుదల మాత్రం జరగాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడటంతో ప్రేక్షకులు అసంతృప్తికి గురవుతున్నారు. ఏది ఏమైనా బాలయ్య లాంటి పెద్ద హీరో సినిమా ఇలా అర్ధంతరంగా ఆగిపోవడంతో ఒక్క సారిగా అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఈ సినిమా విడదుల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎప్పుడు విడుదల అవతుందో కనీసం తెలపాలని అభిమానలు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ సినిమా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది అనడంతో వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివర్లో ఇలా జరగడంతో అంతా నిరాశకు గురయ్యారు. అఖండ 2 తాండవం విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మ్యాన్షన్ హౌస్ మద్యంతో బాలకృష్ణ 'అఖండ-2' కట్ఔట్కు అభిషేకం చేసి, దిష్టి తీసిన ఫ్యాన్స్#Akhanda2Thaandavam pic.twitter.com/FRMT9YZztT
— BIG TV Breaking News (@bigtvtelugu) December 5, 2025

