CITU: కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తాం
CITU (imagecredit:swetcha)
మెదక్

CITU: కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తాం: తపన్ సేన్

CITU: మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల తీవ్రతను పెంచాలని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మహాసభ ప్రతినిధులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం మెదక్ పట్టణంలో రెండో జరుగుతున్న సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభలకు చుక్క రాములు, ఎస్వీ రమ, భూపాల్, జె మల్లిఖార్జున్ అధ్యక్ష, వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తపన్ సేన్ ప్రారంభ ఉపాన్యాసం చేశారు.

ఐక్యం చేయటమే లక్ష్యం

మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు ప్రతి సమస్యలపై చేసిన తీర్మానాల సందేశాన్ని కార్మికుడికి చేరేలా తగిన ప్లాన్ చేయాలని సూచించారు. కార్మికులు సృష్టించిన సంపద, ఖనిజాలను కారు చౌకగా కార్పొరేట్లు ప్రభుత్వంలోని వారి ఏజెంట్ల ద్వారా దోచుకుంటున్నారని తెలిపారు. వారికి వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటమే లక్ష్యంగా దిక్కరణ, ప్రతిఘటన అనే నినాదంతో సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం పెరిగిందని చెప్పారు. ‘దేశాన్ని రక్షించుకుందాం-ప్రజలని ‘రక్షించుకుందాం’ అనే స్ఫూర్తితో తమ మహాసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. 76ఏండ్ల స్వాతంత్ర భారతంలో సాధించుకున్న హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Drunk driving: ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్.. 900 మంది మందుబాబులు అరెస్ట్!

నయాఫాసిస్టు ధోరణితో

మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు తగినట్టుగా డాన్స్ చేస్తున్నదని ఎద్వేవా చేశారు. పాలకులు విదేశీ ప్రయోజనాలకోసమే నిర్ణయాలు చేస్తున్నారనీ, వారి స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు మీడియాను, ఇతర ఏజెన్సీలను సమర్దవంతంగా రకంగా వినియోగించుకుంటున్నదనీ, తద్వారా అబద్దాలను ప్రచారం చేస్తున్నదని తెలిపారు. ఒక చెప్పాలంటే నయాఫాసిస్టు ధోరణితో పాలన కొనసాగిస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంతో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మన ఆలోచన, ఆచరణ మరింత స్పష్టంగా ఉండాలని సూచించారు. జూలై 9న జరిగిన సమ్మెలో కార్మికులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల స్పందన బాగా ఉందన్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సమరశీలతను ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయని చెప్పారు. మారుతున్న ప్రస్థితులను ఎదుర్కోవాలంటే.. ఖచ్చితమైన ప్రణాళిక అవసరమన్నారు. పోరాటాల్లో ఆర్థిక సరిపెట్టకుండా.. సాధారణ ప్రయోజనాలతోనే సర్వీసులు, వసతుల కల్పన విషయంలో శ్రద్ద పెట్టాలని సూచించారు.

వ్యవస్థాగత పరాజయం

పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల్లో కేసుల పాలవుతున్నాం, జైళ్లకు వెళ్తున్నాం. అయినా కార్మికులు మనని ఎందుకు గుర్తించటం లేదో పరిశీలించాలన్నారు. కార్మికుల మధ్య అనైక్యతను పెంచేందుకు కులం, మతం, ప్రాంత విభేదాలను సృష్టిస్తున్నదని చెప్పారు. ఈ కుట్రలను కార్మికులు. ప్రజలు అర్థం చేసుకునేలా చైతన్యాన్ని కల్పించాలని సూచించారు. కోరుకునేదేందంటే.. విషపూరితమైన పాలకులు కార్పొరేట్లకు యూనియన్లు పోరాటాలే లేని, స్వేచ్ఛాయుతమైన లాభార్జనకోసం పరిస్థితులను కల్పించటమే పాలకుల ద్యేయమని చెప్పారు. పెట్టుబడిదారి వ్యవస్త గత 30 సంవత్సరాలుగా వ్యవస్థాగత పరాజయంలో ఉందని చెప్పారు.ఆ నేపథ్యంలోనే దూకుడు పెంచిందని గుర్తు చేశారు.లేబర్ కోడ్ల విషయంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. దీనికి కారణం కూడా కార్మిక ఐక్య కారణమని చెప్పారు. ఇలాంటి పోరాటాలు మరిన్ని జరగాలని సూచించారు. మనం ఎక్కడున్నాం. ఎక్కడికి చేరాలి? అనేది చర్చించాలని ఆలోచించాలన్నారు. కార్మిక ఉద్యమం పాలకుల కుట్రలు అర్థం చేసుకుని కార్పొరేట్ల వారికి తాబేదార్లుగా ఉన్న పాలకుల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ మహసభలో తగిన కార్యాచరణ చేస్తుందని తెలిపారు. కర్నాటకలో ఒక రోజు సమ్మెతో 12గంటల పనివిధానాన్ని తిప్పికొట్టారని గుర్తు చేశారు.పోరోటాలు, ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు తగిన విధంగా చర్చలు జరపాలను సూచించారు.

Also Read: Strong Earthquake: జపాన్‌లో పవర్‌ఫుల్ భూకంపం.. సముద్రంలో సునామీ అలలు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు