Drunk driving: ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్
Drunk driving ( IMAGE credIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Drunk driving: ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్.. 900 మంది మందుబాబులు అరెస్ట్!

Drunk driving: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు జరిపిన వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో ఏకంగా 900 మంది తాగుబోతులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ప్రతీ ఆయా కమిషనరేట్ల పరిధుల్లోని వేర్వేరు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం జరిపిన పరీక్షల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 474 మంది మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయారు.

Also Read: Drunk Driving: కేసులు నమోదు అయినా కనిపించని మార్పు..

26 మంది ఆటో డ్రైవర్లు

పట్టుబడ్డ వారిలో 381 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 26 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇక, కార్లు నడుపుతూ మరో 67 మంది పట్టుబడ్డారు. ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 426 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 323 మంది ద్విచక్ర వాహనదారులు, 17 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మరో 85 మంది కార్లు డ్రైవ్ చేస్తూ దొరికిపోగా, ఒకరు భారీ వాహనాన్ని నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు పట్టుబడ్డ ఈ 900 మందిపై కేసులు నమోదు చేశారు. వీరందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నారు.

Also Read: Secunderabad Patny: గుడిలో అమ్మవారి విగ్రహం మాయం?.. ఎక్కడంటే!

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు