Khammam District: కోర్టును తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలెక్కడ?
Khammam District (imagecredit:swetcha)
ఖమ్మం

Khammam District: హైకోర్టును తప్పుదోవ పట్టించిన అధికారిపై చర్యలెక్కడ?.. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్!

Khammam District: హైకోర్టును తప్పుదోవ పట్టించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సీనియర్ అసిస్టెంట్ వ్యవహారంలో విచారణ ప్రారంభించాల్సిన దశలోనే సబ్ కలెక్టర్(Sub Collector) మౌనం పాటించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొమ్మేపల్లి–లింగపాలెం భూ నిర్వాసితుల కేసుల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ఆర్టీఐ(RTI) ద్వారా ఆర్డీవో(RDO) విచారణ నివేదికలు, అధికారిక సర్వే రికార్డులు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్వతంత్ర విచారణకు ఆదేశాలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. గ్రామస్తులు, రైతుల మాటల్లో విచారణ జరిగితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చి, హైకోర్టు(High Cort) కేసుల్లో జరిగిన నిజాల దాచివేత బయటపడుతుందన్న భయం ఉందని చెబుతున్నారు. దాంతో సీనియర్ అసిస్టెంట్‌(Senior Assistant)పై శాఖాపరమైన చర్యలు తప్పవని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే విచారణను కావాలనే ఆలస్యం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీఐ ద్వారా లభించిన పత్రాలు, 2020లో నిర్వహించిన ఆర్డీవో విచారణ నివేదికలు ఇవన్నీ ఒకే దిశగా చూపుతున్నప్పటికీ, హైకోర్టును తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు ఉన్న అధికారిపై ఇప్పటివరకు విచారణ ప్రారంభించకపోవడం వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

హైకోర్టు మిస్లీడింగ్ ఆరోపణలపై మౌనం ఎందుకు?

హైకోర్టు ముందు ప్రభుత్వ తరఫున దాఖలైన కౌంటర్‌లో నిజాలను దాచిపెట్టారన్న తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ అంశంపై సబ్ కలెక్టర్ స్పందించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి విచారణ మొదలైతే హైకోర్టులో వాస్తవాలకు విరుద్ధమైన కౌంటర్ దాఖలైందా? ఆర్ & ఆర్ అర్హతల ఎంపికలో అక్రమాలు జరిగాయా? భూ–చెట్ల నష్టపరిహారాల్లో ఉద్దేశపూర్వక అవకతవకలు జరిగాయా? అన్న అంశాలు రికార్డులతో సహా బయటపడే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.

‘విచారణ – చర్యలు’ అన్న భయమేనా?

2018 నుంచి ఒకే కార్యాలయంలో కొనసాగుతూ, భూసేకరణ మరియు R&R విభాగాలపై కీలక ప్రభావం చూపుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్‌పై విచారణ జరిగితే, కేవలం వ్యక్తిగత బాధ్యతలే కాకుండా వ్యవస్థాపరమైన లోపాలు కూడా వెలుగులోకి వస్తాయన్న భయంతోనే పైస్థాయి అధికారులు మౌనం పాటిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Medchal District: ఆశా వర్కర్ పోస్టుల సమస్యల పరిష్కారానికై కలెక్టర్‌కి వినతి!

కాపాడే ప్రయత్నమా? లేక పరిపాలనా నిర్లక్ష్యమా?

గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం.. హైకోర్టును తప్పుదోవ పట్టించిన ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణకు ఆదేశాలు ఇవ్వకపోవడం, ఫైళ్లను అదే సెక్షన్‌లో పెండింగ్‌లో ఉంచడం, హైకోర్టులో ఫ్రెష్, నిజాయితీగల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా జాప్యం చేయడం, ఈ పరిణామాలన్నింటిని కలిపి చూస్తే, సీనియర్ అసిస్టెంట్‌(Senior Assistant)ను కాపాడే ప్రయత్నమే జరుగుతోందా? అన్న అనుమానం బలపడుతోందని అక్కడి వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ మౌనం కీలకంగా మారిందన్న విమర్శలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా కలెక్టర్ జోక్యం చేయాలన్న డిమాండ్

ఈ వ్యవహారంలో ఇక ఆలస్యం తగదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన ఆరోపణలపై స్వతంత్ర విచారణకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారిని కీలక బాధ్యతల నుంచి తప్పించాలని గ్రామస్తులు కోరారు. హైకోర్టులో నిజాలను ప్రతిబింబించే ఫ్రెష్ కౌంటర్ దాఖలు చేయాలి. సబ్ కలెక్టర్ మౌనం కొనసాగుతున్న వేళ, ఖమ్మం(Khammam) జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల హెచ్చరిక

హైకోర్టును తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు చిన్న విషయం కాదు. విచారణను ఎంత ఆలస్యం చేసినా నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి. ఇప్పుడైనా విచారణ మొదలుపెట్టకపోతే, ఈ మౌనమే రేపు మరింత పెద్ద ఆరోపణలకు దారితీస్తుందని, గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. హైకోర్టు మిస్లీడింగ్‌పై విచారణ ఎప్పుడు జరపుతారు. ఎవరి కోసం ఈ మౌనం? సీనియర్ అసిస్టెంట్‌ను కాపాడేందుకేనా ఈ జాప్యం అంటూ.. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల్లో మోత్తం ఇదే ప్రధాన చర్చగా మారింది.

Also Read: Triple Murder Case: తల్లి, చెల్లి, తమ్ముడిని చంపేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వ్యక్తి.. ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్

Just In

01

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!

Sathupalli News: సత్తుపల్లి మెడికల్ సిండికేట్ దందా తనిఖీల్లో అనుమానాలు..?