Kothagudem Railway Station: కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం సృష్టించింది. ప్రయాణికులు రైల్వే స్టేషన్లో ఉండగానే బాంబు ఉన్న సంచిని కుక్క కొరకడంతో ఆ బాంబు బ్లాస్ట్ అయిపోయి కుక్క కూడా మృతి చెందింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్(Kothagudem Railway Station) లోని ఒకటో ప్లాట్ఫారంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. బాంబు ఒక్కసారిగా పేలడంతో రైల్వేస్టేషన్లో వేచి ఉన్న ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.
భయ భ్రాంతులతో ప్రయాణికులు
అయితే తనిఖీలు నిర్వహించిన పోలీసులు మాత్రం నాటుబాంబుగా గుర్తించి ప్రయాణికులకు ఎలాంటి అపాయం లేకుండా జాగిలాలతో తనిఖీలు నిర్వహించి జాగ్రత్త చర్యలు చేపట్టారు. పరుగులు పెట్టిన ప్రయాణికులంతా పోలీసుల తనిఖీలతో ఊపిరి పీల్చుకొని ప్రయాణాలు చేసేందుకు సంసితులయ్యారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం సంభవించదని ప్రయాణికులకు పోలీసులు హామీ ఇవ్వడంతో భయ భ్రాంతులకు గురైన ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ వన్ సమీపంలోని చెత్తకుప్పల్లో ఉన్న నాటుబాంబు కుక్క కొరకడంతో ప్రమాదం సంభవించింది. పోలీసుల తనిఖీల్లో మరో నాలుగు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటుబాంబును కొరికి ఒక కుక్క మృతి చెందిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుండి ఒక కుక్క తినే పదార్థంలా భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటుబాంబును రైల్వే ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో అది ప్రేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఎస్పీ వివరించారు. నాటు బాంబులను చెత్తలో పడేసిన వ్యక్తుల గురించి పోలీసులు విచారణ చేపట్టామని తెలిపారు. ఈ ఘటనలో మరే విధమైన కోణం లేదని ఎస్పీ నిర్ధారించారు. ఎవరూ కూడా సోషల్ మీడియా(Social Media)లో ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ పై ఓ సంచిలో బాంబు
సంచిని అక్కడ వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
సంచిని వీధి కుక్క మొరగడంతో ఒక్కసారిగా బాంబు పేలి కుక్క మృతి
పేలుడు శబ్దానికి పరుగులు తీసిన ప్రయాణికులు
సీఎం రేవంత్ పర్యటన… pic.twitter.com/FBWNOPfVJJ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2025
