Alibaba Quark AI Glasses: చైనా దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అలీబాబా తన మొదటి AI స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. వీటికి Quark AI Glasses అనే పేరు పెట్టారు. 2025 నవంబర్ 27న అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చైనాలో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ గ్లాసెస్ బయటకు సాధారణ సన్‌గ్లాసెస్‌లా కనిపించినప్పటికీ, అవి ఫోటోలు తీయగలవు, వినగలవు, మాట్లాడగలవు అలాగే ఫోన్‌ను టచ్ చేయకుండానే ఎన్నో పనులు చేయగలవు.
అలీబాబా AI స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్స్ ఇవే
Quark గ్లాసెస్ రెండు మోడళ్లలో మార్కెట్ లోకి వచ్చాయి. G1 మోడల్ చవక ధరలో ఉంటుంది (1,899 యువాన్, సుమారు $265), కెమెరా మాత్రమే ఉంది, కానీ లెన్స్‌లో స్క్రీన్ లేదు. S1 మోడల్ ప్రీమియమ్ వేరియంట్ (3,799 యువాన్, సుమారు $530), కెమెరా + లెన్స్‌లో రెండు చిన్న డిస్‌ప్లేలు కలిగి ఉంది. రెండు మోడళ్లు తేలికపాటి (45–50 గ్రాములు), అలాగే మీరు మీ సొంత రిసిప్షన్ లెన్స్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.గ్లాసెస్‌లో ముందుభాగంలో చిన్న కెమెరా, S1 మోడల్‌లో లెన్స్‌లలో గ్రీన్ స్క్రీన్‌లు, గ్లాసెస్‌లోనే స్పీకర్లు, రెండు చిన్న బ్యాటరీలు, పవర్‌ఫుల్ Qualcomm చిప్ ఉన్నాయి.
వాడటం చాలా సింపుల్!
దీనిని వాడటం చాలా ఈజీ. కుడి వైపు టచ్ చేస్తే గ్లాసెస్ ఆన్ అవుతుంది, “Hello Qwen” అని చెప్పడం వలన AI మీతో మాట్లాడటానికి రెడీ అవుతుంది, తర్వాత చైనీస్ లేదా ఇంగ్లీష్‌లో కమాండ్లను ఇవ్వవచ్చు.
రోజువారీ జీవితంలో చేసే పనులు కూడా చేస్తాయి!
ఈ గ్లాసెస్‌లు రోజువారీ జీవితంలో ఎన్నో పనులు చేస్తాయి. షాపింగ్ కూడా చేయగలవు. మీరు చూసిన వస్తువు గురించి “How much on Taobao?” అడగండి, 2 సెకన్లలో ధర చెప్పేస్తుంది. “Buy it” అంటే 3 సెకన్లలో Alipay తో పేమెంట్ అయిపోతుంది. ఏదైనా అడిగితే వెంటనే ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా దారి చూపడం, మీటింగ్స్ రికార్డింగ్, సంగీతం వినడం, ఫోన్ కాల్స్ హ్యాండ్స్-ఫ్రీ చేయడం వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెండు చిన్న బ్యాటరీల వల్ల 24 గంటల వరకు వాడకం సాధ్యం, ఒక బ్యాటరీ ఖాళీ అయితే వెంటనే మళ్ళీ వేరేది మార్చుకోవచ్చు.
ఇవి ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రస్తుతం ఈ స్మార్ట్ AI చైనాలో మాత్రమే (Tmall లేదా Alibaba స్టోర్‌లలో) ఉన్నాయి. 2026లో ప్రపంచవ్యాప్తంగా AliExpress లో అందుబాటులోకి రానున్నాయి.
