Jammu Kashmir Terror Attack: కాశ్మీర్ లో ఉగ్ర మూకల దాడి అత్యంత హ్యేయమైన చర్య అని… కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవతలు నడయాడిన పుణ్యభూమిలో ప్రధాని మోడీ నిర్లక్ష్యంతో రక్తం ఏరులై పారుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులు మతం పేరుతో టూరిస్టులను కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Jammu Kashmir Terror Attack: కాశ్మీర్ దాడి ఇప్పుడే ఎందుకు? పాకిస్తాన్ ప్లాన్ ఏంటి?
కేంద్ర ప్రభుత్వం పాలన చేతకాక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కేంద్ర హోం శాఖ ఆదిశగా పనిచేయడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీవ్రవాదుల దుశ్చర్యలపై నిఘ వర్గాలు నిద్ర నటిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లో ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపి ప్రశాంత వాతావరణంలో నెలకొల్పాలని ఆయన సూచించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సానుభూతి వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు