Jammu Kashmir Terror Attack: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి భారత్ సహా.. యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పహల్గాం ప్రాంతం (Pahalgam Attack) లోని పర్యాటకులపై జరిగిన కాల్పుల్లో కనీసం 28 మంది చనిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం (Indian Govt) సైతం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్షను సైతం నిర్వహించారు. అయితే ఈ ఉగ్రదాడి వెనక ఓ మాస్టర్ ప్లాన్ (Pak Master Plane) ఉన్నట్లు తెలుస్తోంది.
పర్యాటకం టార్గెట్
గతంతో పోలిస్తే ఆర్టికల్ 370 రద్దు (Article 370) తర్వాత కశ్మీర్ లో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడి ప్రాంతాల్లో టూరిస్టుల సందడి నెలకొనడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. మెున్నటిదాకా స్థానిక యువత నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకొంటూ వచ్చిన ముష్కరులకు.. తాజాగా వారు పనిలో పడటం ఏమాత్రం సహించలేకపోతున్నారు. పర్యాటకుల దాడి చేయడం ద్వారా.. కశ్మీర్ లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని భావించి ఈ దాడికి టెర్రరిస్టులు తెగబడినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయంగా కుట్ర
మరోవైపు ఉగ్రదాడి ద్వారా అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలని పాక్ ముష్కరులు భావించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ (JD Vance) తన భార్యతో సహా భారత పర్యటనకు వచ్చారు. దీంతో అంతర్జాతీయ మీడియా ఫోకస్ మెుత్తం భారత్ పై పడింది. ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా వారికి ఆతిథ్యం ఇవ్వడాన్ని ప్రపంచ మీడియా హైలెట్ చేస్తూ వచ్చింది. యావత్ మీడియా ఫోకస్ భారత్ పై ఉన్న సమయంలో కశ్మీర్ లో దాడి జరిపితే అంతర్జాతీయంగా కశ్మీర్ అంశం తెరపైకి వస్తుందని ముష్కరులు కుట్ర పన్నినట్లు సమాచారం.
బలూచిస్తాన్ గొడవ సైడ్ ట్రాక్
మరోవైపు పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ (Balochistan Issue) ప్రాంతం గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. అక్కడి మిలిటెంట్స్ (Balochistan Militants).. పాక్ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల ఏకంగా ఓ ట్రైన్ ను హైజాక్ చేయండంతో అది అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ ను బలూచిస్తాన్ పై నుంచి తప్పించి తిరిగి భారత్ వైపు మళ్లించేందుకు ఈ దాడి చేసి ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read: Visakha Man Died In Attack: మొక్కలకు నీళ్లు పోసి.. కాశ్మీర్ దాడిలో ప్రాణం వదిలి.. విశాఖలో విషాదం
సౌదీ పర్యటన
ప్రధాని మోదీ.. రెండ్రోజుల సౌదీ పర్యటన (Soudi Tour)ను ముష్కరులు టార్గెట్ చేసినట్లు కూడా అనుమానాలు కలుగుతున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ సౌదీ వెళ్లారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని అంతా భావించారు. అయితే సౌదీ కంట్రీ.. మెున్నటి వరకూ పాక్ కు మిత్ర దేశంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు పాక్ ను కాదని భారత్ తో సత్సంబంధాలు పెట్టుకోవాలని ఆ దేశం భావించింది. ఈ క్రమంలో భారత్ ను టార్గెట్ చేస్తే మోదీ పర్యటన అర్ధాంతరంగా ముగించి.. ఆ రెండు దేశాల మైత్రీని అడ్డుకోవచ్చని పాక్ కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రధాని మోదీ.. సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భారత్ వచ్చేశారు.
ఆర్టికల్ 370
జమ్ముకశ్మీర్ లో అంతర్యుద్ధం రాజేసేందుకు అవకాశంగా ఉన్న ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయడంతో ముష్కరులకు తోక కత్తిరించినట్లు అయిపోయింది. మెున్నటి వరకూ జమ్ముకశ్మీర్.. రాష్ట్రపతి పాలనలో ఉండగా.. యావత్ కశ్మీర్ ను భారత బలగాలు కంట్రోల్ లోకి తెచ్చుకున్నాయి. ముష్కరులకు ఫండ్స్ అందకుండా అన్ని మార్గాలను మూసివేశాయి. అదే విధంగా సరిహద్దుల్లో భద్రతను టైట్ చేసి.. చొరబాటుదారులను చెక్ పెట్టడం మెుదలుపెట్టాయి. దీన్ని సహించలేని పాక్ ఉగ్రవాదులు.. భారీ ఉగ్రదాడి ద్వారా భారత్ కు ఒక హెచ్చరిక పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ కారణం చేతనే ఈ దాడి చేసి ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.