Hanuman Jayanti celebrations: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో అంజన్న సన్నిధి మార్మోగింది. ఆలయంలో హనుమాన్ చిన్నజయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ నిర్వహించారు.
జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి దీక్షాపరులు లక్షలాదిగా కొండకు తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, అర్ధరాత్రి నుండి లక్షన్నరకు పైగా భక్తుల రాకతో కొండ కిక్కిరిసిపోయింది.
Also read: Saleshwaram: ఈ గుడితో అంత ఈజీ కాదు.. ప్రతీ అడుగు సాహసమే.. ఏడాదిలో 3 రోజులే ఛాన్స్!
కోనేరులో స్నానమాచరించిన భక్తులు, క్యూలైన్ ద్వారా వెళ్లి ఇరుముడి సమర్పించి, మాల విరమణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించు కుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి రెండు నుండి మూడు గంటల సమయం పట్టిండుతుందాని ఆలయ అర్చకులు తెలిపారు.