Saleshwaram (Image Source: Twitter)
తెలంగాణ

Saleshwaram: ఈ గుడితో అంత ఈజీ కాదు.. ప్రతీ అడుగు సాహసమే.. ఏడాదిలో 3 రోజులే ఛాన్స్!

Saleshwaram: తెలంగాణ అమర్ నాథ్ (Telangana Amarnath) గా కీర్తింపబడుతున్న సలేశ్వరం ఆలయ (Saleshwaram Temple) జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నల్లమల్లలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న లింగమయ్య (Lingamayya Swami)ను దర్శించుకునేందుకు భక్తులు పయనమవుతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఎన్నో సాహసాలతో కూడుకొని ఉంటుంది.

ప్రత్యేక బస్సులు ఏర్పాటు
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఈ సలేశ్వరం ఆలయం ఉంది. ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఈ శివాలయం ఉంది. సలేశ్వరంకు తెలంగాణలోని పలు పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సలేశ్వరంకు నాగర్ కర్నూల్ (Nagarkurnool), అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డీపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు.

అడవిలో నడకయాత్ర
సలేశ్వర ఆలయంలో పూర్తిగా దట్టమైన అడవిలో ఉంటుంది. దీంతో ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రత్యేకంగా మార్గం ఉండదు. దీంతో భక్తులు 4 కి.మీ మేర అటవీ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. చెట్టులు, చేమలు, వాగులు, వంకలు, జలపాతాల సవ్వడ్లు, కొండాకోనల అందాలు చూసుకుంటా ఈ యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే సాధారణ రోజుల్లో ఆ మార్గాల్లో పులులు సంచరిస్తుంటాయని అటవీ అధికారులు చెబుతుంటారు. ఈ జనసంచారం నేపథ్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తారు.

పలు రాష్ట్రాల నుంచి..
ఏడాదిలో 3 రోజులు మాత్రమే దర్శమమిచ్చే ఇక్కడి శివయ్యను చూసేందుకు ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాది భక్తులు వచ్చి.. స్వామి వారి సేవలో తరిస్తుంటారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అడవిలోకి భక్తులను అనుమతిస్తారు.

Also Read: Ram Setu bridge: సముద్ర గర్భంలో రామసేతు? వాట్ ఏ క్రియేషన్..

గిరిజనులే పూజారులు
ఎత్తైన కొండలు, దట్టమైన అడవిలో ఉండే సలేశ్వరం లింగమయ్య ఆలయంలో చెంచులో పూజారులుగా వ్యవహరిస్తారు. అక్కడి తరలివచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. అయితే జాతర జరిగే మూడు రోజులు సలేశ్వరం ఆలయ పరిసరాలు, గుడికి వెళ్లే అటవీ మార్గం భక్తులతో రద్దీగా దర్శనమిస్తాయి.

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!