Ram Setu bridge: శ్రీరాముడు నిర్మించిన పురాతన రామసేతు వంతెనను హిందువులు, సనాతన వాదులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. రాముని ఆధ్వర్యంలో వానరసేన ఈ వంతెనను నిర్మించినట్లు రామాయణం చెబుతోంది. అయితే రామసేతు వంతెన (Ram Setu bridge) నిజంగానే రాముడు (Lord Sri Rama) నిర్మించారా? అది నిజంగానే ఉందా? అన్న చర్చ గత దశాబ్దాల కాలంగా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రామసేతుకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.
వీడియోలో ఏముందంటే!
సముద్ర గర్భంలో ఉన్న రామసేతు వంతెన వద్దకు ఓ సైంటిస్ట్ బృందం వెళ్లడాన్ని వీడియోలో గమనించవచ్చు. వారంతా వంతెనపై నడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు రామసేతు నిర్మాణానికి వాడిన రాళ్లను కూడా ఆ శాస్త్రవేత్తల బృందం చాలా దగ్గరగా పరిశీలించింది. వాటిపై శ్రీరామ అంటూ సంస్కృతంలో రాసి ఉండటం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు సముద్రం అడుగున ఓ పెద్ద రాతి దేవాలయాన్ని కూడా మీరు గమనించవచ్చు. అలాగే శ్రీరాముడు విగ్రహం కూడా ఆకట్టుకుంటోంది.
The Rama Setu: Exploring the Floating Rocks Beneath the Waves 🌊✨
Dive into the depths of legend with us as we explore the Rama Setu bridge—said to be built with floating rocks that defy gravity! 🧜♂️💎#MythologyMeetsReality #RamaSetu #UnderwaterWonders
जय श्री राम 🙏🚩 pic.twitter.com/JDrUbpPSKL
— Pari mehra (@pari_aruu01) April 8, 2025
వీడియో నిజమైందేనా?
అయితే ఈ వీడియో పెద్ద ఎత్తున నెట్టింట వైరల్ కావడంతో అసలు ఇది నిజమైందేనా అన్న అనుమానాలు మెుదలయ్యాయి. అయితే ఇది నిజమైన రామసేతు కాదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టించిన వీడియోనని తేల్చి చెప్పింది. కాబట్టి ఎవరూ దీనిని ఒరిజినల్ వీడియోగా భావించి షేర్ చేయవద్దని కోరింది. ఏది ఏమైనా వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా రామసేతు వంతెను చూసినట్లే ఉందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Telangana BJP: సన్నబియ్యం vs దొడ్డు బియ్యం.. బీజేపీకి ఎందుకంత బాధ?
రామసేతు నిజమే!
రాముడు నిర్మించినట్లుగా చెప్పే రాముసేతు వంతెన నిజం కాదని చాలా మంది వాదిస్తుంటారు. అయితే భారత్, శ్రీలంక మధ్య నిర్మింపబడిన రామసేతు కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం గతేడాది జులైలో స్పష్టం చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటా సాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను అప్పట్లో విడుదల చేసింది. ఈ రామసేతు వంతెన 29 కిలోమీటర్ల పొడవు.. సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు అప్పట్లో ప్రకటించింది.