Telangana BJP: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే సన్నబియ్యం క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మాటల యుద్దానికి దిగాయి. ఎవరికి వారే ఈ క్రెడిట్ మాకే దక్కుతుందని వారిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లలో చేయలేని పనులను కేవలం మా ఏడాది పాలనలోనే చేస్తున్నామని, పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.
సన్నబియ్యం క్రెడిట్ ఎవరిది?
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పథకం క్రెడిట్ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికే (Telangana Congress Govt) దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర వాటా ఉన్నప్పటికి ఈ పథకంలో మాత్రం పూర్తి క్రెడిట్ రేవంత్ సర్కారుదేనని తేల్చేస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలయజేస్తున్నారు. బీజేపీ నాయకులు అన్నట్లు ఈ పథకంలో కేంద్ర వాటా ఉంటే, బీజేపీ పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నాయకులకు చురకలంటిస్తున్నారు.
పేదల కడుపు కొట్టారు!
పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం మా ప్రభుత్వం సన్నబియ్య పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద 20 శాతం అధనంగా భారం పడుతుంది. అయినా కూడా పేద ప్రజల ఆకలి సదుద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినా దొడ్డుబియ్యాన్నే పంపిణీ చేశారు. వేల కోట్ల రూపాయల బియ్యాన్ని పక్కదారి పట్టించి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న నిరుపేదలందరికీ పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇందుకోసం ఏటా 3 కోట్ల 10 లక్షల మందికి 30 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నామని తెలిపారు.
Also Read: AP Inter Results 2025: రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ మార్పులు గమనించారా.. లేకుంటే కష్టమే!
కిలోకు రూ.40 చెల్లింపు
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకంలో మెజార్టీ ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఇటీవల వ్యాఖ్యానించారు. అన్నారు. కేంద్ర ప్రతి కిలోకు రూ. 40 చెల్లిస్తోందన్నారు. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 10 శాతం భారం మాత్రమే పడుతుందన్నారు. అయినా రేషన్ షాపులో కనీసం ప్రధాని మోదీ (PM Modi) ఫొటో కూడా పెట్టడం లేదని పేర్కొన్నారు. అయితే దీనిని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. సన్నబియ్యం లో క్రెడిట్ కోసం బీజేపీ పాకులాడుతోందని విమర్శిస్తున్నారు. కావాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీనిని అమలు చేసి చూపించి అక్కడ ప్రధాని ఫొటో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.