MLC Kavitha(image credit;X)
కరీంనగర్

MLC Kavitha: అసెంబ్లీ బరిలో కవిత.. అక్కడి నుండే పోటీ?

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్ అయిందా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కవితకు గులాబీ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనేది పార్టీలో చర్చ జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తద్వారా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని, బీఆర్ఎస్‌పై పట్టు సంపాదించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ తన సొంత కేడర్ పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేసినట్లు ఆమె పర్యటనలే స్పష్టం చేస్తున్నాయి.

జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గం ఎంచుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై పట్టు సాధించే దిశగా కవిత పావులు కదుపుతున్నట్లు సమాచారం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఉప ఎన్నికలు ఖాయమని ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకోసం నియోజకవర్గాల్లో నేతలను సైతం ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం శాయశక్తుల కృషి చేశారు. సక్సెస్ అయ్యారు. దీంతో ఉప ఎన్నికలు వస్తే జగిత్యాల స్థానాన్ని కాపాడుకోవాలని పార్టీతో పాటు కవిత సైతం భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాలని ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఢీకొనాలంటే కవిత లాంటి అభ్యర్థే కరెక్ట్ అని స్థానిక బీఆర్ఎస్ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

వరుస సమావేశాలు

జగిత్యాలపై కవిత ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. జగిత్యాలతో సైతం పర్యటించారు. తాజాగా సైతం పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. కేడర్ కు దిశానిర్దేశం చేశారు. జగిత్యాలలో ఉప ఎన్నిక వస్తే తానే బరిలో ఉంటానని తద్వారా కవిత సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పార్టీని ఎవరు వీడిన నష్టం ఉండదని, రాబోయే కాలం బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక వస్తే బరిలో ఉంటానని చెప్పకనే చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ ని గ్రామ గ్రామాన నిలదీయాలని పిలుపునిచ్చారు. “జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్ లో చేరారా అన్న అనుమానం వచ్చిందని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంతో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు.

మరోవైపు

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోనూ దిగుతారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తాను ఎంపీగాప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానంలో కవిత పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తన సంస్థ అయిన జాగృతితో బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

Also read: MLAs Dissatisfaction: మంత్రులు సహకరించట్లే.. మొరపెట్టుకుంటున్న ఎమ్మెల్యేలు!

బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జాగృతి తనవంతు పాత్ర పోషించింది. ఇక 2014లోనిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి కవిత విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి ఆరవింద్ చేతిలో ఓడిపోయారు. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినప్పటికీ చేయలేదు. తిరిగి మళ్లి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా? లేకుంటే కరీంనగర్ గానీ, మరే ఇతర నియోజకవర్గంలో పోటీ చేస్తారా? అనే ప్రచారం సైతం ఊపందుకుంది.

స్టార్ క్యాంపెయినర్ గా ఎదగాలనే ప్రణాళికలు

బీఆర్ఎస్ పార్టీలో బలమైన నేతగా ఎదగాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించింది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తన కేడర్ ను బలోపేతం చేయాలని భావిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన నేతగా ఎదగాలని భావిస్తుంది. పార్టీలోనే స్టార్ క్యాంపెయినర్ కావాలని వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవసరం అయితే తన అనుచరులకు టికెట్లు సైతం ఇప్పించుకోవాలని, అందుకే సొంత కేడర్ ను బలపేతం చేసుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నట్లు పార్టీలోనే చర్చజరుగుతుంది. మరోవైపు జాగృతి సంస్థను పటిష్టం చేస్తున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు