Karimnagar News: తల్లి బిడ్డల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆడపిల్లతో తల్లికి ఉండే అనుబంధమే వేరు. సమాజంలో ఏ విధంగా మెలగాలి? తోటివారితో ఎలా నడుచుకోవాలి? అత్తింటిలో ఎలా వ్యవహరించాలి? వంటివి తల్లి నుంచే ఒక ఆడపిల్ల నేర్చుకుంటూ ఉంటుంది. అందుకే ఏ యువతిని ప్రశ్నించినా.. స్త్రీలలో తమ బెస్ట్ ఫ్రెండ్ అమ్మనే అని చెబుతుంటారు. అలాంటి తల్లి ఒక్కసారిగా దూరం కావడంతో ఓ యువతి తట్టుకోలేకపోయింది. ఆమె చేసిన పని ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి గత మూడు రోజులుగా తల్లి సమాధి వద్దనే ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాత్రి, పగలు, ఎండా, చలి అన్న భేదం లేకుండా సమాధి వద్దే యువతి రోధిస్తూ ఉండిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ‘అమ్మా లే అమ్మా.. ఇంటికి పోదాం’ అంటూ సమాధి వద్ద పదే పదే యువతి అంటున్నట్లు పేర్కొన్నారు.
డిప్రెషన్ లోకి వెళ్లడం వల్లే..
తల్లి మరణాన్ని సదరు యువతి తట్టుకోలేకపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంటికి వెళ్దామని ఎంతగా నచ్చజెప్పినప్పటికీ యువతి మాట వినడం లేదని పేర్కొన్నారు. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో తాము ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యువతి పరిస్థితిని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిద్ర, ఆహారం, నీరు లేకుండా ఇలాగే ఉండిపోతే ఆమె ఆరోగ్యం ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Sarpanch Candidate:మహిళలకు రూ.1 లక్ష.. పండుగకు రూ.20 వేలు.. సర్పంచ్ అభ్యర్థి వరాల జల్లు!
‘అధికారులు పట్టించుకోవాలి’
3 రోజులుగా తల్లి సమాధి వద్దనే ఉన్న యువతి విషయంలో అధికారులు కలుగజేసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. షీటీమ్స్, సఖి టీమ్, మహిళా సంక్షేమ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఆమెను తక్షణమే స్మశానం నుంచి తీసుకెళ్లి.. వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరింత డిప్రెషన్ లోకి వెళ్లి ఏమైనా చేసుకునే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.
తల్లి సమాధి వద్దే మూడు రోజులుగా యువతి నిద్ర
కరీంనగర్ జిల్లాలోని కబరస్తాన్లో(స్మశానంలో) ఓ యువతి తన తల్లి మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే గత మూడు రోజులుగా నిద్రిస్తూ సంచలనం సృష్టించింది. యువతి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి, పగలూ రాత్రీ తేడా లేకుండా సమాధిని ఆనుకుని ఉండటం… pic.twitter.com/ehk0WXTup2
— ChotaNews App (@ChotaNewsApp) December 2, 2025

