Cantonment Roads (imagecredit:swetcha)
తెలంగాణ

Cantonment Roads: కంటొన్మెంట్‌లో ప్రత్యామ్నాయ రోడ్లు.. ప్లాన్ అదరహో!

Cantonment Roads: హైదరాబాద్(Hyderabad), సికిందరాబాద్(sikandrabad) జంట నగరాల నుంచి కంటోన్మెంట్ మీదుగా సికిందరాబాద్ లోని పలు ప్రాంతాలకు, పొరుగు జిల్లాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు తలనొప్పిగా మారిన ప్రత్యామ్నాయ రోడ్ల వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చేందుకు సర్కారు సిద్దమైనట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన సోమవారం మరో అడుగు ముందుకు పడినట్లు జీహెచ్ఎంసీ(GHMC) ఇంజనీర్లు వెల్లడించారు ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ వర్క్ పర్మిట్ ఇవ్వటంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ రూ. 960 కోట్ల రోడ్ల పనులకు టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ మంగళవారం నుంచి మొదలు కానుంది. దీనికి తోడు కంటోన్మెంట్ లో ప్రత్యామ్నాయ రోడ్ల కోసం సేకరించనున్న రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా రూ. 442 కోట్ల విలువైన భూమి జవహర్ నగర్ లో ఉందని, అక్కడ రక్షణ శాఖకు స్థలాలను కేటాయించాలని కోరుతూ సోమవారం జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సర్కారుకు ప్రతిపాదనలను సమర్పించినట్లు సమాచారం.

పెండింగ్‌లో ఉన్న కేబీఆర్ పార్కు

కంటోన్మెంట్ ప్రత్యామ్నాయ రోడ్లకు సంబంధించి మంగళవారం జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 22 వరకు బిడ్లను స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు సుమారు పదేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కేబీఆర్ పార్కు(KBR Park) చుట్టూ హెచ్ సిటీ(HCT) పనులను మరో నెలరోజుల్లో ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ పనులకు సంబంధించి కోర్టు కేసుల్లేని జంక్షన్లలో పనులు మొదలుపట్టాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించటంతో హెచ్ సిటీ పనులపై జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న ఆరు సంస్థల జాబితాను సర్కారుకు సమర్పించిన జీహెచ్ఎంసీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: Drugs Seized: డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ దాడులు.. ఎండీఎంఏ గంజాయి స్వాధీనం

మూడు వంతెనలకు ప్లాన్‌లు ఖరారు

కంటోన్మెంట్ లో ప్రత్యామ్నాయ రోడ్లలో భాగంగా మూడు వంతెనలకు జీహెచ్ఎంసీ(GHMC) ప్లాన్ లను ఖరారు చేసింది. రక్షణ శాఖ భూముల్లో(Defense Department lands) జీహెచ్ఎంసీ రెండు ఓవర్లు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి9Bridge)ని నిర్మించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తుంది. రామకృష్ణాపురం(Ramakrishna Puram) వద్ద రూ.210 కోట్లతో రోడోవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే నిధులను జమ చేయగా, ఇదే రామకృష్ణాపురం వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు మరో రూ. 35 కోట్లను జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు వెల్లింగ్టన్, మారెడ్ పల్లి ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లను కూడా నిర్మించేందుకు జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. కంటోన్మెంట్(Contonmnt) లో ప్రత్యామ్నాయ రోడ్లకు సమాంతరంగా ఇప్పటికే పంజాగుట్ట నుంచి సికిందరాబాద్ వైఎంసీఏ వరకు పంజాగుట్ట, బేగంపేట, ప్రకాశ్ నగర్, ప్యారడైజ్ ప్రాంతాల్లో నాలుగు ఫ్లై ఓవర్లు అందుబాటులో ఉన్నా, ఆఫీసు వేళల్లో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పటం లేదు.

ఫ్లై ఓవర్ పైనే తడుస్తూ

ఇక చినుకు పాటి వర్షం పడిందంటే చాలు గంటల తరబడి వాహనదారులు ఫ్లై ఓవర్ పైనే తడుస్తూ నిల్చుండిపోవల్సిన పరిస్థితి ఏర్పడింది. సికిందరాబాద్ వైఎంసీఏ(YMCA) నుంచి అటూ పంజాగుట్ట(Panjagutta), అమీర్ పేట(Ameerpet), రాజ్ భవన్(Rajbhavan) రోడ్డు వైపు వాహానాలను మరింత స్పీడ్ గా కదిలేందుకు వీలుగా బేగంపేట రసూల్ పురా చౌరస్తా కన్నా కాస్త ముందు నుంచి శ్యామ్ లాల్ బిల్డింగ్ వరకు హెచ్ సిటీ ప్రాజెక్టు కింద అండర్ పాస్ ను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి తోడు ఇటు పంజాగుట్ట నుంచి రసూల్ పురా మీదుగా వైఎంసీఏ వరకు, రసూల్ పురా జంక్షన్ నుంచి మినిష్టర్ రోడ్డు వైపు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా రసూల్ పురా మెట్రోరైలు భవన్, మెట్రో స్టేషన్ల మధ్య నుంచి రసూల్ పురా జంక్షన్ మీదుగా మినిష్టర్ రోడ్డు వైపు రూ.150 కోట్లతో 4 లేన్ల యునీ డైరెక్షనల్ ఫ్లై ఓవర్, చిలకలగూడలో రూ.3 కోట్లతో ఆర్ యూబీని, రూ.80 కోట్లతో పాటిగడ్డ వైపు మరో ఆర్ఓబీ నిర్మించేందుకు కూడా టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు.

Also Read: Vijay Devarakonda: బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. కాంబో అదిరింది!

Just In

01

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి