Farmhouse Party: తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటలకు బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నేపథ్యంలో వారిద్దరితో పాటు పలువురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే 10 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు 7 హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రాథమికంగా పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి, ఫామ్ హౌస్ యజమాని సుభాష్, సూపర్ వైజర్ తాడికుద్దీన్ షేక్, రియాజ్ హుక్కా అనే నలుగురు వ్యక్తులపై ఎస్ఓటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఓటీ వర్గాలు తెలిపాయి.
అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడైన పార్థసారథి పుట్టిన రోజు కావడంతో ఆయన ఫామ్ హౌస్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దానికి దువ్వాడ జంటను ఆహ్వానించారు. పార్టీకి దువ్వాడ జంటతో పాటు మెుత్తం 29 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనూహ్యాంగా ఎస్ఓటీ పోలీసులు చేయడంతో పార్టీలో పాల్గొన్న దువ్వాడ జంటతో పాటు నిర్వాహకులు షాక్ కు గురయ్యారు. విదేశీ మద్యం, హుక్కా పరికరాలు పట్టుబడటంతో ప్రాథమికంగా దువ్వాడ జంట సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆర్గనైజర్ తో పాటు పార్టీ నిర్వాహణలో కీలకంగా వ్యవహరించిన నలుగురిపై కేసులు నమోదు చేశారు.
2024 నుంచి ఫ్యామిలీకి దూరంగా..
ఇక దువ్వాడ జంట విషయానికి వస్తే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు. గతంలో వైసీపీ తరపున ఆయన చురుగ్గా పనిచేశారు. పార్టీ సస్పెండ్ చేయడంతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. అయితే శ్రీనివాస్ కు గతంలోనే వివాహమైంది. దువ్వాడ మాధురితో పరిచయం ఏర్పడిన తర్వాత 2024 నుంచి కుటుంబానికి దూరంగా ఆమెతోనే కలిసి జీవిస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, రీల్స్ తో ఈ జంట బాగా పాపులర్ అయ్యింది.
Also Read: Pawan Kalyan: వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం.. దిల్లీ హైకోర్టుకు వెళ్లిన పవన్.. కీలక ఉత్తర్వులు జారీ
బిగ్ బాస్‌కి వెళ్లొచ్చి..
ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు షోలో పాల్గొన్న మాధురి.. రాష్ట్రవ్యాప్తంగా మరోమారు అందరి దృష్టిని ఆకర్షించారు. మూడు వారాల పాటు హౌస్ లో ఉండి.. తనదైన మాటలతో చర్చనీయాంశంగా మారారు. అనంతరం హౌస్ నుంచి బయటకు వచ్చేసిన మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన రెమ్యూనరేషన్ డబ్బును పేదలకు పంచుతూ ఆమె వీడియోలు సైతం పోస్ట్ చేశారు. ఇలా మంచి పేరు సంపాదిస్తున్న క్రమంలోనే ఫామ్ హౌస్ పార్టీలో ఈ జంట దొరికిపోవడం వారి అభిమానులను షాక్ కు గురిచేస్తోంది.

