CM Revanth Reddy: చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భరోసా ఇచ్చారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సురెన్స్ లను అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..సినీ కార్మికుల ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమీ కావాలనే దానిపై సమిష్టి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్లాన్ ఇవ్వాలన్నారు.
Also Read: Alampur Jogulamba Temple: అలంపూర్ ఆలయాల్లో ఆధిపత్యం.. శక్తి పీఠంని సైతం వదలని రాజకీయం
సినిమా కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలి
సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు తాను సూటిగా చెప్పానని సీఎం వివరించారు. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపునకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరానని వివరించారు. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామన్నారు. సినిమా కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణ లో షూటింగ్ జరిగేలా సహకరించాలన్నారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలన్నారు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందని, సమస్యకు పరిష్కారాల మార్గాలు అన్వేషించాలన్నారు.
చిత్రపరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్తా…
తాను వంద శాతం కార్మికుల పక్షానే నిలుస్తానన్నారు. ఇన్ని ఏళ్లలో సినిమా కార్మికుల తో ఎవరూ పిలిచి మాట్లాడలేదన్నారు. పదేళ్లలో సినిమా అవార్డులు ఇవ్వలేదన్నారు. కానీ తాము ఇటీవల గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించామన్నారు. ఈకార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు,తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Junior OTT: ‘జూనియర్’ ఓటీటీలోకి వస్తోంది.. శ్రీలీల ఫ్యాన్స్‌కు ‘పండగే’!