power sector reforms: విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రైవేట్ డిస్కంలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఈమేరకు విద్యుత్ అమెండ్ మెంట్ బిల్లు(Electricity Amendment Bill) 2025ను కేంద్రం రూపొందించింది. విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న టెక్నికల్(Technical), కమర్షియల్(Commercial) నష్టాలను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. పోటీతత్వం ఉంటే మెరుగ్గా పనిచేస్తాయని, అప్పుడు ఎలాంటి నష్టాలు ఉండబోవని కేంద్రం భావిస్తోంది. ఈ విద్యుత్ సవరణ చట్టం ద్వారా డిస్కంలు.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఆర్థిక ఇబ్బందులు, జవాబుదారీతనంతో పనిచేస్తాయని పేర్కొంది. వినియోగదారుడికి నచ్చిన వారి వద్ద కరెంట్ కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ప్రజలపై భారం పడదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అలగే రైతులు, పేద ప్రజలకు అందించే సబ్సిడీల విషయంలోనూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంది.
కమిషన్ నిబంధనల ప్రకారం
ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో డిస్కంలను ప్రభుత్వాలే నడిపిస్తున్నాయి. కాగా ఈ విద్యుత్ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వ రంగంతో పటు ప్రైవేట్ డిస్కంలు కూడా విద్యుత్ సరఫరాను చేపట్టనున్నాయి. ప్రైవేట్ డిస్కంలు కూడా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది. వినియోగదారుడు తనకు నచ్చిన టెలికాం సర్వీస్(Telecom service) ను వాడుకున్నట్లు ఇక్కడ కూడా వినియోగదారుడు తనకు నచ్చిన వారి వద్ద నుంచి కరెంట్ కొనుగోలు చేసే అవకాశముంటుందని స్పష్టంచేసింది. ఇదిల ఉండగా ప్రస్తుత క్రాస్-సబ్సిడీలను దశలవారీగా తొలగించాలని కేంద్రం ఈ అమెండ్ మెంట్ లో ప్రతిపాదించింది.
Also Read: Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. రూ.82,000 కోట్ల భారీ పెట్టుబడి.. రెన్యూ పవర్ వచ్చేస్తోంది!
మల్టిపుల్ సప్లయర్లు
డిస్కంల మధ్య పోటీతత్వం విషయం ఎలా ఉన్నా ఈ విధానం వల్ల ప్రైవేట్ డిస్కంలు తమకు నచ్చిన ధరను నిర్ణయించుకునే అవకాశం ఉందని, తద్వారా సామాన్యులపై భారం పడే అవకాశముందని ఈ అమెండ్ మెంట్ బిల్లుపై విమర్శలు వచ్చాయి. కాగా కేంద్రం తాజాగా దీనిపై స్పష్టతనిచ్చింది. విద్యుత్ కాస్ట్ పెరుగుతుందనే భ్రమ వద్దని తెలిపింది. ఇది కేవలం డిస్కంలు నష్టాల నుంచి గట్టెక్కేందు, విద్యుత్ చౌర్యం అవ్వకుండా ఉండేందుకు, ట్రన్స్ మిషన్ వేస్టేజ్ ను నివారించేందుకు మాత్రమేనని పేర్కొంది. ఈ బిల్లు సవరణ ద్వారా మల్టిపుల్ సప్లయర్లు పెరుగుతారని, ప్రస్తుతం ఉన్న డిస్కంల లైన్లు, నెట్‌వర్క్‌ను వాడుకుని వేరే డిస్కంలు వ్యాపారం చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇది ఫైనాన్షియల్ గా డిస్కంలు ఎదుర్కొనే భారాన్ని తగ్గిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే డిస్కంలల మధ్య పోటీ పెరిగి సిబ్బంది మన ఇంటికే వచ్చి తక్కువ ధరకే కనెక్షన్ ఇస్తామని ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. అలాగే.. ముసాయిదా బిల్లు ప్రకారం ఒక యూనిట్‌కు అయ్యే వ్యయాన్ని పూర్తిస్థాయిలో డిస్కమ్‌లు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే నేరుగా ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమచేయాలి. లేదంటే ప
విద్యుత్ సవరణ బిల్లులో..
ప్రభుత్వ, ప్రైవేట్ డిస్కంలు.., కేవలం తమ వినియోగదారుడికే కాకుండా అందరికీ సర్వీస్ అందించేలా కేంద్రం బిల్లును ప్రతిపాదించింది. అందుకుగాను ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్(యూఎస్ వో)’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యుత్ సవరణ బిల్లులో ప్రతిపాదించింది. ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని చెబుతోంది. విద్యుత్ చౌర్యం, మీటరింగ్ లోపాలు, బిల్లింగ్ లోపాలు, ఏటీటీ నష్టాలు దీనికి కారణంగా చెబుతోంది. ఇదిలా ఉండగా 1 మెగవాట్ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే ఇండస్ట్రీలు, మెట్రో వంటి పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ ద్వారా కరెంట్ కొనుగోలు చేయొచ్చని ప్రతిపాదనల్లో పేర్కొంది. అయితే ఈ విద్యుత్ సవరణ బిల్లు 2025ను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమేరకు అమలు చేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తోందని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ ప్రజలకు 200 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ తరుణంలో విద్యుత్ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Emerging New AP: ఏపీకి నూతన శకం!.. పెరుగుతున్న పెట్టుబడులు.. భవిష్యత్‌పై చిగురిస్తున్న ఆశలు!
