Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ విశాఖ కేంద్రంగా కొలువు దీరేందుకు రంగం సిద్దమైంది. అయితే తాజాగా ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో రూ. 82,000 కోట్ల పెట్టుబడితో మరో కంపెనీ రాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
లోకేశ్ ఇంకా ఏం చెప్పారంటే?
గురువారం ఉదయం 9 గం.లకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ భారీ పెట్టుబడి గురించి వెలల్డించారు. శుక్రవారం నుంచి ఏపీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుండగా అందుకు ఒక రోజు ముందు లోకేశ్ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రెన్యూ (ReNEW) తిరిగి వచ్చిందని లోకేశ్ స్పష్టం చేశారు. ఆ సంస్థ పెట్టబోయే రూ.82 వేల కోట్ల పెట్టుబడి రాష్ట్ర పునరుత్పాదక రంగంలో విఫ్లవాత్మక మార్పు తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుందని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖ కేంద్రంగా జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII partnership summit)లో రెన్యూ కంపెనీ ఛైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా, అతడి బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు.
#ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025
After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be… pic.twitter.com/JczVgbtcEO— Lokesh Nara (@naralokesh) November 13, 2025
ముందే క్లూ ఇచ్చిన లోకేశ్..
రెన్యూ సంస్థ భారీ పెట్టుబడుల గురించి మంత్రి నారా లోకేశ్ ముందే క్లూ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా బుధవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. 2019 తర్వాత ఏపీలో కొత్త ప్రాజక్టులను నిలిపివేసిన ఓ సంస్థ.. తుపానులా ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వస్తోందని లోకేశ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం ఉదయం 9 గం.లకు ప్రకటిస్తానని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ మెుదలైంది. లోకేశ్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తోందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ కనిపించింది. అయితే వారి అంచనాలను అందుకుంటూ అతి భారీ పెట్టుబడి ప్రకటన లోకేశ్ నుంచి రావడంతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A company that stopped new projects in 2019, is coming back to AP like a storm tomorrow. Who is it?? 😊😎Big unveil at 9 AM! Stay tuned!!#InvestInAP #ChooseSpeedChooseAP pic.twitter.com/bM9hrlfPjp
— Lokesh Nara (@naralokesh) November 12, 2025
మరో రూ.15,000 కోట్ల ఒప్పందం
మరోవైపు బుధవారం మరో కీలక ఒప్పందాన్ని సైతం ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకుంది. రూ.15,000 కోట్లతో 300-MW హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేలా ఏపీ ప్రభుత్వంతో టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) సంస్థ అంగీకారం కుదుర్చుకుంది. దిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ బోర్డ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. ‘మేము విశాఖలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తాం. దీర్ఘకాలిక డిజిటల్ మౌలిక వసతులను అందించడమే కాకుండా నాణ్యమైన ఉద్యోగాలను సృష్టిస్తాం’ అని టిల్మన్ గ్లోబల్ కో ప్రెసిడెంట్ సచిత్ అహుజా వెల్లడించారు.
Also Read: Transport Department: స్వేచ్ఛ కథనంతో సర్కార్ నిర్ణయం.. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రణాళికలు
40 ఎకరాల భూమి కేటాయింపు
టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు పర్యవేక్షించనుంంది. ఆ కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన అనుమతుల కోసం వివిధ శాఖలతో సమన్వయం కల్పించనుంది. అంతేకాదు డేటా సెంటర్ ఏర్పాటు కోసం 40 ఎకరాల భూమిని సైతం ఏపీ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ 2028 నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 200 – 300 మందికి ప్రత్యక్ష, 800 – 1,000 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
