Telangana Govt: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్‌కు కొంత ఉపశమనం కలిగించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌ను రేషనలైజ్ చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. దీంతో టీచింగ్ స్టాఫ్‌కు ఎంతో కొంతైనా పని భారం తగ్గుతుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4500 మంది వరకు పలు పాఠశాలల్లో వీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ డేటాను అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా నాన్ టీచింగ్ స్టాఫ్‌ను ఎక్కడెక్కడికి మార్పులు, చేర్పులు చేపట్టాలని నిర్ణయించనున్నట్లు సమాచారం. జిల్లాల్లో జెడ్పీ స్కూళ్లు కలెక్టర్ల పరిధిలో ఉన్న అంశం కావడంతో ఈ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
Also Read: Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల.. డిప్యూటీ సీఎం ఆదేశం
భారం తగ్గించడానికి
సర్కారు స్కూళ్లలో పలుచోట్ల ఒకే స్కూళ్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మొత్తంలో ఉన్న స్కూళ్లలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడంతో నాన్ టీచింగ్ వారు చేసే పని మొత్తం టీచింగ్ స్టాఫ్‌పై పడుతోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరిట అదనపు భారాన్ని మోపుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీంతో విద్యాశాఖ నాన్ టీచింగ్ స్టాఫ్‌ను రేషనలైజేషన్ చేస్తే అయినా కొంతమేర అయినా భారం తగ్గుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకేచోట ఇద్దరు లేదా ముగ్గురు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే వారిని మరో స్కూల్‌కు పంపించేలా ఏర్పాట్లు చేయలాని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తరలింపు లేదా సర్దుబాటు
బోధనేతర సిబ్బంది అంటే పాఠశాలల్లో బోధించని అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఐటీ, లైబ్రరీ, కస్టోడియల్ వంటి పనుల్లో సహాయపడే సిబ్బంది. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య, అవసరాల ఆధారంగా బోధనేతర సిబ్బంది(అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, సపోర్ట్ స్టాఫ్) కేటాయింపులను విద్యాశాఖ చేపట్టనున్నట్లు సమాచారం. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతో పాటు పాఠశాల కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడటం ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, సమర్థవంతమైన పనితీరును సాధించడం దీని ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఈ ప్రక్రియలో సిబ్బందిని అవసరమైన చోట తరలించడం లేదా సర్దుబాటు చేయడం వంటివి చేయనున్నారు.
Also Read: Telangana Govt: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్
