Vijay-Kanth-Reddy (Image source Swetcha Daily)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Big TV Vijay Reddy: బిగ్ టీవీ అధినేత పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమానికి చేయూత

Big TV Vijay Reddy:

మహబూబాబాద్, స్వేచ్ఛ: అనతికాలంలోనే తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బిగ్ టీవీ, స్వేచ్ఛ డైలీ, చోటా న్యూస్ ఫ్లాట్‌ఫామ్స్ అధినేత వెన్నం విజయ్ కాంత్ రెడ్డి (Big TV Vijay Reddy) ఆదివారం (నవంబర్2) పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ  సందర్భంగా మహబూబాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలోని పిల్లలకు చేయూత అందించారు. ‘మా అసోసియేషన్’ (స్థానిక జర్నలిస్టుల అసోసియేషన్) అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెన్నం విజయకాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో చిన్నారులతో కేక్ కట్ చేయించి, వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ… అమెరికాలో అట్టహాసమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నా, సొంత ఊరుపై మమకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందిస్తూ తనదైన శైలిలో వెన్నం విజయకాంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని కొనియాడారు.

Read Also- ISRO CMS-03: 4,410 కేజీల ఉపగ్రహాన్ని మోసుకొని నింగిలోకి దూసుకెళ్లిన బహుబలి రాకెట్

బిగ్ టీవీని స్థాపించి అతికొద్ది కాలంలోనే ప్రధాన టీవీ ఛానళ్లకు ధీటుగా ప్రసార మాధ్యమాలను ప్రజలకు చేరవేసి మన్ననలు పొందుతున్నారని ప్రస్తావించారు. చోటా న్యూస్, స్వేచ్ఛ డైలీ డిజిటల్ పేపర్లను సైతం జనాల్లోకి తీసుకెళ్తూ, ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ మీడియా యుగంలో తనకంటూ స్థానాన్ని ఏర్పరచుకున్న ఆశయ సాధనుడు విజయకాంత్ రెడ్డి అని కొనియాడారు. అనతికాలంలోనే బిగ్ టీవీ, స్వేచ్ఛ డైలీ న్యూస్, చోటా న్యూస్ యాప్‌లను తీసుకొచ్చి 550 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత వెన్నం విజయకాంత్ రెడ్డిదని పేర్కొన్నారు.

ఆపద సమయంలో ఆపన్న హస్తం అందిస్తూ సొంత జిల్లాకు చెందిన ఎంతోమంది అనారోగ్యాల బారినపడిన సందర్భాల్లో వారికి తనవంతు సాయం చేస్తూ మానవతా మూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బిగ్ టీవీని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన విజయకాంత్ రెడ్డి, రానున్న రోజుల్లో మరింత విజయాలతో విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగుర్తి సుధాకర్, రామరాజు ఉపేందర్, తీగల రాజేందర్, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంబాల శివకుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు గండు కార్తీక్, డాక్టర్ వీవీ సిన్హా, నవీన్, లీలావతి, కార్తీక్ పాల్గొన్నారు.

Read Also- 45 The Movie: ‘45 ది మూవీ’ నుంచి ‘అఫ్రో టపాంగ్’ సాంగ్ వచ్చింది చూశారా..

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?