Bathukamma
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bathukamma: ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించే పండుగ బతుకమ్మ.. విశేషాలు ఇవే

Bathukamma: ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించే పండుగ ‘బతుకమ్మ’ (Bathukamma). తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. మహిళల సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనశైలిని ఈ పండుగ ప్రతిబింబిస్తుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల సమయంలో 9 రోజులపాటు జరుపుకుంటారు. చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ అని పిలుస్తారు. మహిళలు ప్రకృతిని ఆరాధిస్తూ, పువ్వులతో తయారుచేసే బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పూజించడం ప్రధానంగా కనిపిస్తుంది. మహిళలంతా ఒక్కచోట సామూహంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. సాంప్రదాయ పాటలు పాడుతారు. పాటల్లో జీవనశైలి, భక్తిభావం ఉంటాయి.

బతుకమ్మను లక్ష్మీదేవిగా, పార్వతీదేవి అంశగా, శ్రీచక్రశోభితగా, తమ ఇంటి ముత్తయిదువగా భావించి మహిళలు ఆరాధిస్తారు. రంగురంగుల పువ్వులను సేకరించి, శ్రీచక్ర మేరు ఆకారంలో అందంగా పేర్చి అలంకరిస్తారు. మహిళల సృజనాత్మకతకు దర్పణంగా నిలుస్తుంది. ప్రధానంగా తంగేడు, బంతి పువ్వులు, గునుగు, మల్లె, కనకాంబరం ఇలా రకరకాల రంగురంగుల పువ్వును సేకరించి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు.

బతుకమ్మ పండుగ మహిళల ఐక్యత, ప్రకృతి పట్ల గౌరవాన్ని, మాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జీవన స్పూర్తిని ప్రతిబింబించే పండుగ ఇదని చెబుతుంటారు. బతుకమ్మ అంటే ‘జీవించు అమ్మ’ అని అర్థం. తెలంగాణలో పల్లెల్లోని మహిళలు, ఆడపిల్లలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. బతుకమ్మను పేర్చడంతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

మహిళలు పంచభూతాల సమన్వయంతో జీవించాలని, ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని ఈ పండుగ ద్వారా ఇస్తుంటారు. పండుగ చివరిరోజున బతుకమ్మను సమీపంలోని చెరువు, లేదా వాగులో వదులుతారు. ఈ ఘట్టం పర్యావరణం పట్ల మహిళ అవగాహనను తెలియజేస్తుంది. ఇదొక ఆచారపరమైన పండుగ మాత్రమే కాదని, మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. గ్రామీణ జీవనానికి బతుకమ్మ పండుగ చాలా దగ్గరగా ఉంటుంది.

Read Also- Press Meet Cancel: రేపే భారత్‌తో మ్యాచ్.. ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్న పాకిస్థాన్.. కారణం ఇదే!

9 రోజులు.. ప్రత్యేక పేర్లు

బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ (చిన్న బతుకమ్మ) అని పిలుస్తారు. ఆ రోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలు నైవేధ్యంగా పెడతారు. ఇక రెండవ రోజున అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేధ్యంగా అందిస్తారు. మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు.- ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేధ్యం ఇస్తారు. నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున నానబోసిన బియ్యం, పాలు, బెల్లం నైవేధ్యం పెడతారు. 5వ రోజున అట్ల బతుకమ్మ అని అంటారు. ఆ రోజు అట్లు, దోసెలు నైవేధ్యంగా సమర్పిస్తారు. 6వ రోజున అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజు నైవేద్యం పెట్టరు. 7వ రోజున వేపకాయల బతుకమ్మ అని అంటారు. బియ్యంపిండి వేయించి వేపపండ్లు నైవేధ్యంగా ఇస్తారు. ఇక, 8వ రోజున వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఆ రోజు నువ్వులు, నెయ్యి, బెల్లం నైవేధ్యం ఉంటుంది. చివరిదైన 9వ రోజున సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ) నిర్వహిస్తారు. ఆ రోజు 5 రకాల నైవేథ్యాలు ఇస్తారు. అందులో పెరుగు అన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మ అన్నం పెడతారు.

Read Also- Young Filmmakers Challenge: బతుకమ్మపై బంపర్ ఆఫర్.. రూ.3 లక్షలు గెలిచే ఛాన్స్.. 10 రోజులే గడువు!

Just In

01

Pawan Kalyan: ఓజీ రిలీజ్ సమయంలో తెర పైకి పవన్ డిజాస్టర్ మూవీ.. ఎక్కడో తేడా కొడుతోంది?

Mahabubabad District: తొర్రూరు మున్సిపాలిటీలో వివాదం.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు?

Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!

Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ

Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా .. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్