Aarogyasri (imagecredit:swetcha)
తెలంగాణ

Aarogyasri: మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. బిల్లులు రావడం లేదని ఆవేదన

Aarogyasri: ఆరోగ్య శ్రీ సేవలు మళ్లీ బంద్ కానున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.1300 నుంచి 1400 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, గత ఏడాది నుంచి బిల్లులు రిలీజ్ చేయడం లేదని నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ట్రస్ట్ బోర్డుకు ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా, పట్టించుకోవడం లేదని నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(Network Hospitals Association) పేర్కొన్నది. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడంతో తాము ఆసుపత్రులు నడపడం కష్టంగా మారిందని, కనీసం వేతనాలు, మెయింటనెన్స్ కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు టీఎన్ ఏ స్పష్టం చేస్తున్నది. కొన్ని దవాఖాన్లు లోన్లు తీసుకొని మరీ నెట్టుకొస్తున్నట్లు టీఎన్ ఏ ప్రెసిడెండ్ డాక్టర్ వద్దిరాజు రాకేష్​ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలోనూ ప్రభుత్వంతో తాము చర్చలు చేశామని, కానీ ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన వివరించారు. దీంతో చేసేదేమీ లేక స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయని వివరించారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే, సమ్మె కు దిగుతామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లెటర్ ను ఆరోగ్య శ్రీ సీఈవో కు కూడా పంపించినట్లు తెలిపారు.

ప్రతీ సారి ఇదే లొల్లి…?

ప్రతి ఆరు నెలలకోసారి ఆరోగ్య శ్రీ బకాయిలపై నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మె చేయాల్సి వస్తున్నది. గతంలో గ్రీన్ ఛానల్(Green Chanel) లో ఫండ్స్ రిలీజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రతి నెల సుమారు రూ.200 కోట్లు చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు నెట్ వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ ముందడుగు పడలేదని వివరిస్తున్నారు. దీంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో స్ట్రైక్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని డాక్టర్ రాకేష్​ వివరించారు. ఆరోగ్య శ్రీతో పాటు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను నిలిపి వేయనున్నట్లు ఆయన చెప్పారు.ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడం వలన పేద పేషెంట్లకు వైద్యం అందడంలో తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. ఆయా ఆసుపత్రులు సమ్మె చేయడం వలన పేషెంట్ల వైద్యానికి ఆటంకం ఏర్పడటంతో పాటు ప్రభుత్వంపై కూడా ప్రెజర్ పడే ఛాన్స్ ఉన్నది.

Also Read: IRCTC offers: రైల్వే స్పెషల్ ఆఫర్.. టికెట్లపై 20 శాతం డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?

మెకానిజంలో ప్రైవేట్ ను భాగస్వామ్యం చేయాలి…

ఆరోగ్య శ్రీ సేవలకు అంతరాయం కలుగకుండా ఉండాలంటే బోర్డులో నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి ఓ ప్రతినిధిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నదని డాక్టర్ రాకేష్​ తెలిపారు. ప్రస్తుతం కేవలం ప్రభుత్వాధికారులు మాత్రమే ఉండటం వలన, తమకు అన్యాయం జరుగుతుందన్నారు. సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అంతేగాక ప్యాకేజీ ల ధరలను కూడా సవరించాలన్నారు. సకాలంలో పేమెంట్లు ఇవ్వడం వలన పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సులువుగా ఉంటుందని ఆయన స్పష్​టం చేశారు. సమ్మె నోటీసులిచ్చిన ప్రతీసారి రివ్యూలు నిర్వహించి హామీలు ఇవ్వడం కంటే, శాశ్వత పరిష్కారానికి మార్గం చూపాలని టీఎన్ ఏ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read: Naga Vamsi: సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై నిర్మాత నాగవంశీ సెటైరికల్ పోస్ట్

Just In

01

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!