IRCTC offers: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను చెబుతుంటారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు నిత్యం రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఎప్పుడు చూసిన రైళ్లల్లో రద్దీ ఉంటూనే ఉంటుంది. ఇక పండగ సీజన్లు వస్తే రైళ్లు కిక్కిరిపోతుంటారు. రైలు బోగీలో కాలు తీసి పక్కన పెట్టే ప్లేసు కూడా ఉండదు. దీనికి తోడు అదనపు ఛార్జీలు ఉండనే ఉంటాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ సరికొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్లలో రైలు ప్రయాణాన్ని చౌకగా మార్చడంతో పాటు టికెట్ బుకింగ్ ను సులభతరం చేసేలా రౌండ్ ట్రిప్ స్కీమ్ ను (Indian Railways Round Trip Scheme) తీసుకొచ్చింది. ఈ పథకం ప్కారం ప్రయాణికులు రాను పోను టికెట్లు బుక్ చేస్తే.. రిటన్ టికెట్ బేస్ ఫేర్ పై 20% తగ్గింపు లభించనుంది.
ఏ తేదీల్లో బుక్ చేసుకోవాలంటే?
రౌండ్ ట్రిప్ స్కీమ్ కింద టికెట్లను ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రయాణికుడు రిటర్న్ టికెట్ లో 20% డిస్కౌంట్ పొందాలంటే తప్పనిసరిగా రాను, పోను టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కింద సొంతూర్లకు వెళ్లేవారు అక్టోబర్ 13-26 తేదీల మధ్య టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్లీ రిటర్న్ నవంబర్ 17 – డిసెంబర్ 1 మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక రాను, పోను టికెట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
స్టెప్ 1: ఊరికి వెళ్లేందుకు టికెట్ బుకింగ్ (Onward Journey) చేసుకోవాలని భావించే వారు ఐర్ సీటీసీ యాప్ లో ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
❄️ ఐఆర్‌సీటీసీ (IRCTC Rail Connect) యాప్ ఓపెన్ చేసి, హోమ్ స్క్రీన్‌లో ట్రైన్ (Train) పై ట్యాప్ చేయాలి.
❄️ అనంతరం ఫెస్టివల్ రౌండ్ ట్రిప్ (Festival Round Trip) ఆప్షన్ ఎంచుకోవాలి.
❄️ స్కీమ్ వివరాలు చదివి కన్ఫర్మ్ చేయాలి.
❄️ 13 అక్టోబర్ నుండి 26 అక్టోబర్ 2025 మధ్య ఉన్న ట్రైన్లను మాత్రమే సెర్చ్ చేయాలి.
❄️ గమనిక: కేవలం ఇది సీఎన్ఎఫ్ లేదా సీట్లు అందుబాటులో (CNF/Confirmed Availability) ఉన్న ట్రైన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
❄️ ఫ్లెక్సీ / డైనమిక్ ఫేర్ (Flexi/Dynamic Fare) ట్రైన్లు అనుమతి లేవు.
❄️ తర్వాత ప్రయాణికులు తమ వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి (ఇవి రిటర్న్ టికెట్‌కి కూడా ఉపయోగపడతాయి).
❄️ చెల్లింపు పూర్తి చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.
❄️ అనంతరం (Onward Journey) టికెట్ (PNR) లభిస్తుంది.
❄️ అక్కడే ‘Book Return Journey’ (20% Discount) అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
స్టెప్ 2: రిటర్న్ టికెట్ (Return Journey) బుకింగ్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ అనుసరించాల్సి ఉంటుంది.
❄️ ఆన్ వార్డ్ జర్నీ (Onward Journey) కన్ఫర్మేషన్ పేజీ లేదా మై బుకింగ్స్ (My Bookings)లో బుక్ రిటర్న్ జర్నీ (Book Return Journey – 20% Discount) పై ట్యాప్ చేయాలి.
❄️ సోర్స్, డెస్టినేషన్ స్టేషన్లు ఆటోమేటిక్‌గా వస్తాయి (మార్చలేరు).
❄️ 17 నవంబర్ నుండి 1 డిసెంబర్ 2025 మధ్య ట్రైన్లను సెర్చ్ చేయాలి.
❄️ మీకు కావాల్సిన క్లాస్ ఎంచుకోవాలి. చూపబడే ఫేర్‌లో ఇప్పటికే 20% తగ్గింపు కలుపబడి ఉంటుంది.
❄️ Flexi/Dynamic Fare ట్రైన్లు ఇక్కడ కూడా అనుమతి లేవు.
❄️ Onward Journeyలో ఇచ్చిన ప్రయాణికుల వివరాలు అలాగే ఉంటాయి.. మార్చడం కుదరదు.
❄️ చెల్లింపు పూర్తి చేసిన తర్వాత రిటర్న్ టికెట్ (PNR) లభిస్తుంది.
Also Read: T-Fiber: ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలి.. టీ ఫైబర్‌పై సమీక్షలో సీఎం కీలక అదేశాలు
ముఖ్య గమనికలు
❄️ ఈ స్కీమ్ 2025 ఆగస్టు 14 నుండి అమల్లోకి వచ్చింది.
❄️ తగ్గింపు కేవలం రిటర్న్ టికెట్ బేస్ ఫేర్‌పై మాత్రమే వర్తిస్తుంది.
❄️ రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్టీతో పాటు ఇతర పన్నులు పూర్తిగా చెల్లించాలి.
ఉదాహరణకు ఒక ట్రైన్ టికెట్ రూ. 1,000 అయితే అందులో రూ. 700 బేస్ ఫేర్ కాగా రూ. 300 ఇతర ఛార్జీలు కలిసి ఉంటాయి. రౌండ్ ట్రిప్ స్కీమ్ డిస్కౌంట్ (20%) బేస్ ఫేర్ అయిన రూ. 700పై మాత్రమే ఉంటుంది. అంటే రూ.700లో 20 శాతం అనగా రూ.140 తగ్గింపు లభిస్తుంది. మొత్తం సేవింగ్ రూ. 140 మాత్రమే అవుతుంది. రూ. 1,000పై కాదు.