Naga Vamsi: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ (Producer Naga Vamsi) వచ్చేశారు. ఆయన ‘వార్ 2’ (War 2) విడుదల తర్వాత ఫారిన్ వెళ్లినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతే, ఆయన ఫారిన్ వెళ్లారనే వార్తలను బేస్ చేసుకుని, నెటిజన్లు, ఎన్టీఆర్ (Jr NTR) యాంటీ ఫ్యాన్స్ రకరకాలు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా నాగవంశీ విడుదల చేసిన ‘వార్ 2’ సినిమా రిజల్ట్ చూసి, భారీ నష్టం తప్పదని భావించి.. మీడియను ఫేస్ చేయలేక.. ఫారిన్ చెక్కేశారు అన్నట్లుగా సోషల్ మీడియా అంతా ఒకటే వార్తలు. ఈ వార్తలపై ఇంత వరకు ఎవరూ రియాక్ట్ కాలేదు. మరోవైపు ‘వార్ 2’ సినిమా ఫస్ట్ వారంతం బాగానే కలెక్షన్స్ రాబట్టినా, సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను నాగవంశీ విడుదల చేశారు. అందుకుగానూ భారీ ధరను చెల్లించి రైట్స్ సొంతం చేసుకున్నారు. ఎందుకంటే, ఎన్టీఆర్ అంటే తనకు అంత ఇష్టం.
Also Read- Sridevi Vijay Kumar: శ్రీదేవి విజయ్ కుమార్.. సినిమాలకు బ్రేక్ ఎందుకు ఇచ్చిందో తెలుసా?
అంతకు ముందు వచ్చిన ‘దేవర’ సినిమాను కూడా నాగవంశీనే విడుదల చేశారు. ఆ సినిమా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపించినా, ‘వార్ 2’కి మాత్రం నాగవంశీకి భారీ లాస్ తప్పదు అనేలా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. మధ్యలో ఇప్పుడో వివాదం చెలరేగడంతో.. అంతా ఆ వివాదం గురించి చర్చలు చేస్తున్నారు తప్పితే.. థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం లేదు. అలాగే, సినిమాలోని ఎన్టీఆర్ పాత్రపై కొందరు ఫ్యాన్సే పెదవి విరుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాను ఎన్టీఆర్ చేయకుండా ఉండాల్సింది అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి టాక్ మధ్య సినిమా మళ్లీ థియేటర్లలో నిలబడాలంటే మాత్రం అద్భుతమే జరగాలి. అది జరిగే పని కాదు. అందుకే విడుదలకు ముందు నాగవంశీ మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ.. ఆయనపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై నాగవంశీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
Also Read- Jagapathi Babu: ‘ఆ టాపిక్ తీసుకొస్తే.. నేను మీ టాపిక్ తీసుకొస్తా’.. జగ్గుభాయ్‌కి శ్రీలీల వార్నింగ్!
‘‘మీరంతా నన్ను చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు..
వంశీ అది, వంశీ ఇది అంటూ చాలా కథనాలు వస్తున్నాయి…
పర్వాలేదు, ఎక్స్‌లో (ట్విట్టర్) మంచి రచయితలు ఉన్నారు.
మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి, కానీ ఆ సమయం ఇంకా రాలేదు… కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు పడుతుంది.
థియేటర్ల వద్ద… సినిమా కోసం, ఎల్లప్పుడూ!
మా తర్వాతి #MassJatharaతో త్వరలో కలుద్దాం!’’ అని నాగవంశీ తనపై వస్తున్న ట్రోల్స్‌కి సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన పోస్ట్‌ని గమనిస్తే.. ‘వార్ 2’ ప్రభావం బాగానే పడిందనేది అర్థమవుతోంది. అందుకే రవితేజ ‘మాస్ జాతర’తో చూసుకుందామని చెబుతున్నారంటూ ఈ పోస్ట్‌ని కామెంట్స్ పడుతున్నాయి.
Enti nannu chala miss avthunattu unnaru.. 😂
Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…
Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.
At the cinemas… for the cinema,…
— Naga Vamsi (@vamsi84) August 20, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
